బుమ్రా బౌలింగ్ చూశారు.. బుమ్రా స్టెప్పులు చూశారా..? అదరగొడుతున్నాడు..
మొదటి నుంచి కూడా వీరిద్దరూ తమ రిలేషన్‌షిప్‌ను చాలా సీక్రెట్‌గా ఉంచారు. అలాగే పెళ్లి కూడా ఉన్నట్లుండి చేసుకున్నారు. ఏకంగా పెళ్లి ఫొటోలు సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఫ్యాన్స్ ఒకింత ఆశ్చర్యానికి గురైనా, కొత్తజంటకు శుభాకాంక్షలు చెబుతూ ట్రెండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే బుమ్రా, సంజనల ఓ వీడియోను ఫాన్స్ తమ సోషల్ మీడియా ఖాతాల్లో విపరీతంగా షేర్ చేస్తున్నారు. ఆ వీడియోలో ఈ సెలబ్రిటీ కపుల్ ఓ రొమాంటిక్ సాంగ్‌కు చక్కగా డాన్స్ చేస్తూ కనిపించారు. దీంతో ఈ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.
ఇదిలా ఉంటే ఈ వీడియో బుమ్రా-సంజన సంగీత్ ఫంక్షన్‌లోనిది. ఇందులో కొత్త జంట ఆనందంగా ఒకరికొకరు చేతులు పట్టుకుని బాలివుడ్ స్టైల్లో స్టెప్పులేశారు. కాగా పుణెకు చెందిన సంజనా గణేశన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. ఆ తర్వాత మోడలింగ్‌లో ప్రవేశించారు. ఈ క్రమంలో ‘ఫెమినా అఫిషీయల్లీ గార్జియస్’ టైటిల్‌ను గెలుచుకున్నారు. అదే విధంగా, ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో పాల్గొని ఫైనలిస్టుగా నిలిచారు. ఆ తర్వాత స్పోర్ట్స్ ప్రజెంటర్‌గా అవతారమెత్తిన సంజన బుమ్రా ప్రేమలో పడ్డారు. వీరిద్దరి ప్రేమను తమ కుటుంబాలకు తెలియజేసి, ఇరు కుటుంబాలను ఒప్పించి వారి సమక్షంలోనే ఒక్కటయ్యారు.