రోహిత్ శర్మ జస్ట్ మిస్.. లేదంటేనా..?

praveen
ప్రస్తుతం భారత్ ఇంగ్లండ్ జట్ల మధ్య హోరాహోరీ పోరు జరుగుతుంది అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మొదట టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే భారత బౌలింగ్ విభాగం మరోసారి అదరగొట్టడంతో.. తక్కువ పరుగులకే ఇంగ్లాండ్ జట్టు ఆలవుట్ అయింది అన్న విషయం తెలిసిందే. ఇక ఆ తర్వాత గత రెండు మ్యాచుల్లో అద్భుతంగా రాణించినట్లు  గానే టీమిండియా బ్యాట్స్మెన్ లు  అద్భుతంగా రాణిస్తారు అని అందరూ భావించారు. కానీ ఊహించని విధంగా టీమిండియా జట్టు కూడా ఇంగ్లాండ్ బౌలింగ్ దళం ముందు నిలవలేకపోయింది.

 వరుసగా వికెట్లు కోల్పోవడంతో టీమిండియా కష్టాల్లో పడిపోయింది. ఈ క్రమంలోనే ఇక ఓపెనర్ గా రంగంలోకి దిగిన రోహిత్ శర్మ ఎంతో నిలకడగా ఆడుతూ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. ఇక రోహిత్ శర్మ నిలకడగా ఆడుతూ ఉన్న సందర్భంలో అటు ఇంగ్లాండ్ బౌలర్లు  అందరూ కూడా రోహిత్ శర్మ ను  ఇబ్బంది పెట్టేందుకు ఎంతగానో ప్రయత్నించారు. కాగా  భారత ఇన్నింగ్స్ నిలబెట్టేందుకు ఎంతగానో ప్రయత్నించి ఒంటరి పోరాటం చేసిన రోహిత్ శర్మ చివరికి ఎల్బ్బి  డబ్ల్యు ఔట్ అయ్యి   రోహిత్ శర్మ వెనుతిరిగి పెవిలియన్ చేరాల్సిన పరిస్థితి ఏర్పడింది.

 అయితే రోహిత్ శర్మ కనీసం హాఫ్ సెంచరీ చేస్తాడు అని అనుకున్నారు  ప్రేక్షకులు కానీ... ఎల్బిడబ్ల్యు అవుట్ కావడంతో చివరికి రోహిత్ శర్మ పెవిలియన్  చేరాల్సిన పరిస్థితి ఏర్పడింది. సాధారణంగా అయితే రోహిత్ శర్మ ఎప్పుడూ కూడా స్లోగా ఆడటం ప్రేక్షకులు చూసి ఉండరు అన్న విషయం తెలిసిందే. కానీ మైదానంలో కీలక ఆటగాళ్లు పెవిలియన్  చేరిన తరుణంలో ఇక తన ఆట శైలి కి  విరుద్ధంగా ఆడాడు. 144 బంతుల్లో 49 పరుగులు మాత్రమే చేశాడు.. ఇంకా ఒక్క పరుగు చేస్తే ఆఫ్ సెంచరీ పూర్తి అవుతుందన్న తరుణంలో ఇక చివరికి ఎల్బి డబ్ల్యు అవుటయ్యాడు. దీంతో టీమిండియా కష్టాల్లో  పడింది. రోహిత్ శర్మ అవుట్ కాకపోయి ఉంటే మంచి ఇన్నింగ్స్ ఆడే వాడు అని ప్రేక్షకులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: