అందరి చూపు దానిపైనే.. హిస్టరీ రిపీట్ అవుతుందా..?

praveen
ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా భారత జట్టు పోరాట పటిమకు ప్రస్తుతం ప్రశంసల వర్షం కురుస్తోంది అన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా టీ20, వన్డే సిరీస్ లలో  ఎలా ఉన్నప్పటికీ అటు టెస్ట్ సిరీస్ లో భాగంగా భారత జట్టు పోరాడుతున్న తీరు అటు ప్రత్యర్థి ఆటగాళ్లను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంది అన్న విషయం తెలిసిందే. రెగ్యులర్ కెప్టెన్ లేకపోయినప్పటికీ అద్భుతంగా రాణిస్తూ పట్టుదలతో పోరాటం చేస్తుంది టీమిండియా జట్టు. విరాట్ కోహ్లీ లేకపోతే ఇక టీమ్ ఇండియా ఆస్ట్రేలియా లాంటి దిగ్గజ జట్టుతో గెలవడం చాలా కష్టం అని ఎంతోమంది చెప్పినప్పటికీ వారందరి నోళ్ళు మూయిస్తూ ఎంతో అద్భుతంగా రాణిస్తుంది టీమిండియా.

 రెండవ టెస్ట్ మ్యాచ్  లో అద్భుత విజయం సాధించిన టీమిండియా ఇక మూడవ టెస్ట్ మ్యాచ్ ను  ఎంతో తెలివిగా డ్రాగా ముగించింది అనే విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం నాల్గవ టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. ఇక నాల్గవ టెస్ట్ మ్యాచ్ లో  కూడా భారత బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేయడంతో తక్కువ పరుగులకే ఆస్ట్రేలియా ను కట్టడి చేయడంలో విజయం సాధించారు. ఇక నాలుగవ టెస్ట్ మ్యాచ్లో భాగంగా ప్రస్తుతం టీమిండియా చివరి ఇన్నింగ్స్ ఆడుతుంది అనే విషయం తెలిసిందే. ఇక భారత్ ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న క్రికెట్ సమరానికి నేటితో తెరపడింది. రెండు టాప్ జట్లు తలపడుతుండడంతో అటు ప్రేక్షకులందరికీ అసలు సిసలైన మజా అందుతుంది.

 ఈ క్రమంలోనే టీమిండియా జట్టులో కీలక ఆటగాళ్లు గాయాల బారినపడి జట్టుకు దూరం అయినప్పటికీ కూడా... ఎక్కడ టీమిండియా పోరాటపటిమను మాత్రం మారడం లేదు. ఇక ప్రస్తుతం టీమిండియా ఆస్ట్రేలియా గడ్డపై చరిత్ర సృష్టిస్తుందా అన్నదానిపై అందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చరిత్ర సృష్టించాలంటే కావలసింది పట్టుదల, పోరాటపటిమ.  ప్రస్తుతం టీమిండియా లోని 11 మంది ఆటగాళ్లు ఎలాంటి చరిత్ర సృష్టించబోతున్నారు అన్నదానిపైనే ప్రస్తుతం భారత ప్రేక్షకులందరికీ చూపు  ఉంది.  ఇక ఆస్ట్రేలియా గడ్డపై తాడోపేడో తేల్చుకుంటుంది భారత జట్టు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: