ఆర్సిబి కి అతిపెద్ద నిరాశ.. ఆ భారీ హిట్టరే..?
అయితే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు లో ఎంతోమంది ప్రతిభగల అనుభవంగల ఆటగాళ్లు ఉన్నప్పటికీ కూడా ఎక్కడ జట్టుకు మాత్రం ఉపయోగపడలేదు. ఇటీవలే దిగ్గజ క్రికెటర్ గా ఉన్నప్పటికీ ఇటీవల ఐపీఎల్ సీజన్ లో సరిగా చేయకుండా నిరుత్సాహపరిచిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఓపెనర్ ఆరోన్ ఫించ్ పై మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఐపీఎల్ సీజన్ లో 12 మ్యాచ్లు ఆడిన ఆరోన్ ఫించ్ కేవలం 268 పరుగులు మాత్రమే చేశాడు ఇందులో ఒక హాఫ్ సెంచరీ మాత్రమే ఉంది. అతని సహచరుడైన దేవదత్ పడిక్కాల్ యువ ఆటగాడు అయినప్పటికీ ఎలాంటి అనుభవం లేకుండానే 473 పరుగులు చేస్తే ఎంతో అనుభవం కలిగిన ఫించ్ మాత్రం కేవలం తక్కువ పరుగులకే పరిమితం అయ్యాడు. బెంగళూరు జట్టులో ఆరోన్ ఫించ్ ప్రదర్శన ఎంతగానో నిరాశపరిచింది అంటూ ఆకాష్ చోప్రా చెప్పుకొచ్చాడు. పెద్ద మొత్తంలో వెచ్చించి ఆర్సిబి ఫించ్ ను ఆర్సిబి సొంతం చేసుకున్నప్పటికీ ఎక్కడ జట్టుకు ఉపయోగపడలేదు అంటూ చెప్పుకొచ్చాడు. అంతర్జాతీయ టీ20ల్లో భారీ రికార్డును కలిగివున్న ఆరోన్ ఫించ్.. ఐపీఎల్ సీజన్ లో మాత్రం నిరాశపరిచాడు అని.. ఈ హిట్టరే ఆర్ సి బి కి మైనస్ గా మారిపోయాడు అంటూ చెప్పుకొచ్చాడు ఆకాష్ చోప్రా .