ఐపీఎల్ : ధోని స్టైల్ లో ముగించిన జడేజా..?
పాయింట్ల పట్టికలో ఐదవ స్థానంలో ఉన్న కోల్కత నైట్రైడర్స్ జట్టు పాయింట్ల పట్టిక లో చివరి స్థానంలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగగా... కోల్కతా నైట్రైడర్స్ జట్టుకు ఎంతో కీలకంగా మారింది. కానీ ఈ మ్యాచ్లో చివరికి కోల్కతా నైట్రైడర్స్ జట్టు ఓడిపోక తప్పలేదు. అయితే చివరిలో 12 బంతుల్లో 30 పరుగులు కావాల్సి ఉండగా... ఇక చెన్నై సూపర్ కింగ్స్ ఓటమి ఖాయం అని అందరూ అనుకున్నారు. ఆ సమయంలో క్రీజులోకి వచ్చిన జడేజా అద్భుతంగా రాణించడంతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మంచి విజయాన్ని అందుకుంది అనే చెప్పాలి.
ఐపీఎల్ 2020 సీజన్ లో ప్లే ఆఫ్ రేస్ నుంచి ఇప్పటికే నిష్క్రమించిన చెన్నై సూపర్ కింగ్స్... నిన్న జరిగిన మ్యాచ్ లో అనూహ్య విజయాన్ని సొంతం చేసుకుంది. చివరి ఓవర్లలో 12 బంతుల్లో 30 పరుగులు చేయాల్సి వచ్చింది. ఈ దశలో సంచలన ఇన్నింగ్స్ ఆడాడు రవీంద్ర జడేజా. కేవలం 11 బంతుల్లోనే 4 ఫోర్లు 3 సిక్సర్లతో చెలరేగిపోయాడు. చివరి బాల్ లో ఒక పరుగు అవసరం ఉండగా భారీ సిక్స్ కొట్టి చెన్నై సూపర్ కింగ్స్ ని గెలిపించాడు. చెన్నై సూపర్ కింగ్స్ విజయంతో కోల్కతా నైట్రైడర్స్ జట్టు ప్లేఆఫ్ ఆశలకు గండి పడింది అని చెప్పాలి. అయితే అచ్చం రవీంద్ర జడేజా ధోని స్టైల్లోనే నిన్నటి మ్యాచ్ ముగించాడు అని ప్రస్తుతం ప్రేక్షకులు భావిస్తున్నారు.