ఐపీఎల్ : దంచి కొట్టారు.. బతికిపోయారు..?

praveen
ఐపీఎల్ లో ప్రేక్షకుల అంచనాలన్ని  తారుమారు అవుతున్నాయి.  ఏ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు అన్నది కూడా ఊహకందని విధంగా ఉంటుంది. ప్రతి మ్యాచ్  ఎంతో రసవత్తరంగా సాగిపోతూ ప్రేక్షకులందరికీ ఫుల్ టైం ఎంటర్టైన్మెంట్ అందిస్తుంది. కనీసం ఈ ఏడాది ఐపీఎల్ టోర్నీలో ప్లే ఆఫ్ కి అర్హత సాధించే జట్లు ఏవి అని అడిగినా కూడా ప్రేక్షకులు అందరూ చెప్పలేని పరిస్థితి నెలకొంది. ప్రతి మ్యాచ్ విషయంలో ప్రేక్షకులు ఒకటి అనుకుంటే మరొకటి జరుగుతుంది. అందుకే ప్రతి మ్యాచ్ కూడా ఎంతో ఆసక్తికరంగా మారిపోతుంది. ఎందుకంటే మొన్నటి వరకు పేలవ ప్రదర్శనతో విమర్శలు ఎదుర్కొన్న జట్లు ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకుపోతుండడమే ఇందుకు కారణం.

 మొన్నటి వరకు ఢిల్లీ క్యాపిటల్స్,  ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు  పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్ లో నిలిచిన విషయం తెలిసిందే. అయితే మొన్నటి వరకు వరుస విజయాలను సొంతం చేసుకున్న  ఈ మూడు జట్లు దూసుకుపోయాయి. ఇక ఆ తర్వాత పాయింట్ల పట్టికలో చివరిలో ఉన్న కొన్ని జట్లు  సరిగ్గా రాణించలేక వరుస అపజయాలను చవిచూసాయి. కానీ ఆ తర్వాత మాత్రం అంచనాలన్నీ తారు మారు అవుతున్నాయి. ఇటీవలే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు పై చెన్నై సూపర్ కింగ్స్ మంచి విజయం సాధించగా తాజాగా ముంబై ఇండియన్స్ పై రాజస్థాన్ రాయల్స్ జట్టు ఘన విజయాన్ని అందుకుంది.

 భారీ లక్ష్య ఛేదన ను కూడా ఎంతో సునాయాసంగా ఛేదించింది రాజస్థాన్ రాయల్స్ జట్టు.. అంతకు మించి అనే విధంగా ప్రదర్శన చేసిన బెన్ స్టోక్స్... సంజూ శాంసన్  లు మ్యాచ్ లో  అద్భుత విజయాన్ని అందించారు అని చెప్పాలి. కేవలం రెండు వికెట్లు కోల్పోయి మాత్రమే ఎంతో సునాయాసంగా టార్గెట్ చేయించింది రాజస్థాన్ రాయల్స్ జట్టు. దీంతో తమ ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఇక చెలరేగిపోయిన బెన్ స్టోక్  ఏకంగా సెంచరీ పూర్తి చేయగా... మంచి కమ్  బ్యాక్ చేసిన సంజూ  శాంసన్  అర్థ సెంచరీ పూర్తి చేసుకుని జట్టును విజయతీరాలకు వైపు నడిపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: