చెన్నై ఓటమి.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని.. వీడియో వైరల్..?
ఇప్పటికే వృద్ధుల జట్టు అనే విమర్శలు ఎదుర్కొంటున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఈసారి అది నిజం చేసింది అని ప్రేక్షకులు నిరాశ చెందుతున్నారు. ఇప్పటి వరకు ప్రతి సీజన్లో కూడా ప్లే ఆప్ కు అర్హత సాధించిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఈసారి మాత్రం లీగ్ దశలోనే తట్టాబుట్టా సర్దుకుంది. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు పై ఎన్నో ఆశలు పెట్టుకున్న అభిమానులందరూ తీవ్ర నిరాశలో మునిగిపోయారు. చెన్నై సూపర్ కింగ్స్ కి ప్లే ఆఫ్ అవకాశాలు లేవు అన్న విషయాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు అభిమానులు. ఈ క్రమంలోనే ఇటీవల చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆప్ కి అర్హత సాధించకుండా వెనుదిరగడం పై ఓ అభిమాని ఏకంగా కన్నీళ్లు పెట్టుకున్నాడు.
తాను ఐపీఎల్ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు గురించి ఎంతగానో గొప్పగా చెప్పాను అని కానీ ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ జట్టు వరుసగా ఓడిపోయి తట్టా బుట్టా సర్దుకోవడంతో తన స్నేహితులు ఎంతో హేళన చేస్తున్నారు అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. మీకేం తెలుసు అన్నయ్య మా బాధలో మీరేమో ఎక్కడో ఉంటారు.. చెన్నై ఇంటికి వెళ్లి పోయింది నువ్వు కూడా ఇంటికి వెళ్లి పడుకో రా అని స్నేహితులు ఇన్సల్ట్ చేస్తున్నారు... బ్రావో మహేంద్ర సింగ్ ధోనీ వాట్సన్ లకు ఫోటోలు పెట్టి దండలువేసి గోవిందా గోవింద అంటూ హేళన చేస్తున్నారు అంటూ ఇటీవల ఒక పిల్లోడు కన్నీళ్లు పెట్టుకుంటూ చెన్నై సూపర్ కింగ్స్ పై తనకున్న నమ్మకం గురించి చెప్పిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.