అందుకే అతన్ని తీసుకోవడం లేదు.. క్లారిటీ ఇచ్చిన చెన్నై యాజమాన్యం..?

praveen
ఐపీఎల్ చరిత్రలో చెన్నై సూపర్ కింగ్స్ ప్రస్థానం ఎంత విజయవంతంగా సాగిందో  ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రతి ఐపీఎల్ సీజన్ లో ఆడిన ప్రతి సారి కూడా ప్లే ఆప్ కి అర్హత సాధించింది. వరుస  విజయాలను సొంతం చేసుకుంటూ... దిగ్గజ జట్టుగా ఐపీఎల్ టోర్నీలో ప్రతి సీజన్లో తన ప్రస్థానాన్ని కొనసాగించింది  చెన్నై సూపర్ కింగ్స్ జట్టు. ఇక ధోని  సారథ్యంలో ఎంతో విజయవంతంగా ముందుకు సాగింది. ఏ సీజన్లో కూడా వెనక్కి తిరిగి చూసుకోలేదు. దాదాపుగా అన్ని సీజన్లలో ప్లే ఆప్ కు అర్హత సాధించడమే కాదు ఎక్కువ సార్లు ఫైనల్ కు వెళ్ళిన జట్టుగా కూడా సీఎస్కే సంచలన రికార్డును సొంతం చేసుకుంది. అంతే కాకుండా మూడు సార్లు ఐపీఎల్ టైటిల్ను కూడా గెలిచింది.


 అయితే ఐపీఎల్ 2020 సీజన్ లో మాత్రం చెన్నై సూపర్ కింగ్స్ గడ్డు పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతోంది అనే చెప్పాలి. ఎన్ని ప్రయత్నాలు చేసినా అనుకున్నంత స్థాయిలో మాత్రం రాణించలేక పోతోంది. ఇక సురేష్ రైనా జట్టు నుంచి తప్పుకోవడం చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ను ఎంతగానో దెబ్బ తీసింది అని చెప్పాలి. ఇక ఐపీఎల్ 2020 సీజన్లో చెన్నై ఆడుతున్న తీరు మునుపెన్నడూ లేని విధంగా ఉంది. గాయం నుంచి కోలుకున్న ఆల్ రౌండర్ బ్రావో  జట్టులోకి వచ్చిన తర్వాత పరిస్థితి కాస్త మెరుగు పడుతుందని అందరూ అనుకున్నప్పటికీ.. జట్టు ఆట తీరులో మాత్రం ఎలాంటి మార్పు రావడంలేదు.

 ఈ క్రమంలోనే ఎంతో అనుభవం ఉన్న ఇమ్రాన్  తాహిర్  ను జట్టులో ఆడించకుండానే కేవలం రిజర్వులో  ఉంచడంపై  కూడా ప్రస్తుతం విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఇమ్రాన్ తాహీర్ ను  జట్టులోకి తీసుకోకపోవడంపై కూడా చెన్నై జట్టు యాజమాన్యం స్పందించింది. నాణ్యమైన ఆటగాళ్లను కేవలం రిజర్వ్ కి  పరిమితం చేయడం తమకు కూడా ఇష్టం లేదని... కానీ జట్టులో కేవలం నలుగురు విదేశీ ఆటగాళ్లు మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది.. ఇక టాప్ ఆర్డర్లో ఇద్దరు నాణ్యమైన బ్యాట్స్మెన్లు అవసరం.. ఇక ఇద్దరు ఆల్రౌండర్ లు కావాలి కాబట్టి బ్రావో కర్రాన్  ను  తీసుకున్నాం.. త్వరలో  ఇమ్రాన్ తాహిర్ కి  కూడా అవకాశం కల్పిస్తాం అంటూ చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: