సేమ్ సీన్ రిపీట్.. అప్పుడు వరల్డ్ కప్.. ఇప్పుడు ఐపీఎల్..?

praveen
అదే  తప్పు మళ్ళీ రిపీట్ అయింది... అప్పుడు భారత క్రికెట్ జట్టును దెబ్బతీస్తే ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ జట్టును  దెబ్బతీసింది. ఆ ఇద్దరూ మళ్లీ ఓటమికి కారణమయ్యారు . గెలిచే మ్యాచ్ లను సైతం ఓటమి దిశగా తీసుకెళ్లారు. ఆ ఇద్దరు ఆటగాళ్లు ఎవరో కాదు కేదార్ జాదవ్,  మహేంద్రసింగ్ ధోని. సరిగ్గా ఏడాదిన్నర క్రితం.. వన్డే ప్రపంచకప్ జరుగుతోంది. విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత జట్టు ఎంతో అద్భుతంగా రాణించి సెమీఫైనల్స్ వరకు చేరుకుంది. సెమీ ఫైనల్స్ లో  భారత బౌలర్లు అద్భుతంగా ప్రత్యర్థి జట్టును కట్టడి చేశారు. ఇక మిగిలి ఉంది బ్యాట్స్మెన్ల పని మాత్రమే. ఇక్కడ  మ్యాచ్ గెలిస్తే  ఇక ఫైనల్ కి చేరుకోవచ్చు.  న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన ఓపెనర్లు మంచి ఆరంభం వచ్చారు. కానీ ఆ తర్వాత మిడిలార్డర్లో వచ్చిన బ్యాట్మెన్స్  మాత్రం అదే మెరుపులు మెరిపించ లేకపోయారు.


 ముఖ్యంగా నాల్గవ స్థానంలో వచ్చిన కేదార్ జాదవ్ వచ్చి  కావాల్సిన రన్ రేట్ ను మరింత పని చేశాడు.. దీంతో భారత జట్టు పై ఒత్తిడి పెరిగింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన మహేంద్ర సింగ్ ధోనీ అద్భుతంగా రాణించి మరో వరల్డ్ కప్ లో కూడా కీలక పాత్ర పోషిస్తాడు అని అనుకున్నారు అందరు. కానీ కేదార్ జాదవ్ ధోని  కీలక సమయంలో బ్యాటింగ్ చేసిన తీరు ఇప్పటికీ విమర్శలు ఎదుర్కొంటోంది. ఆ ఇద్దరి కారణంగానే టీమిండియా కనీసం ఫైనల్ కి కూడా చేరుకోలేక పోయింది అనడంలో అతిశయోక్తి లేదు. ధోని బ్యాటింగ్ పై విమర్శలు వచ్చిన నేపథ్యంలో అప్పటి నుంచి క్రికెట్ దూరంగా ఉన్నాడు. ఇక ఇప్పుడు అదే సీన్ రిపీట్ అయ్యింది.

 కోల్కతా నైట్ రైడర్స్ తో చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ ఆడిన విషయం తెలిసిందే. చెన్నై సూపర్ కింగ్స్ మొదట బౌలింగ్ చేసింది. ఈ క్రమంలోనే కోల్కతా నైట్ రైడర్స్ బ్యాట్స్మెన్లను కట్టడి చేసి 167 పరుగులకే కట్టడి చేసింది. తర్వాత బ్యాటింగ్కు దిగిన ఓపెనర్లు అద్భుతంగా రాణించడంతో సీఎస్కే అలవోకగా మ్యాచ్ గెలుస్తుంది అని అనుకున్నారు. కానీ ఆ తర్వాత క్రీస్తు లోకి వచ్చిన కేదార్ జాదవ్.. అటు వెంటనే క్రీజులోకి వచ్చిన ధోని బ్యాటింగ్ తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. బౌండరీలు బాదాల్సిన  సమయంలో కేదార్ జాదవ్ టెస్టు మ్యాచ్ లాగా  ఆడుతూ... ప్రతి బాల్ ని డిఫెన్స్ చేస్తూ కనీసం ఒక్క  రన్ కూడా తీయలేదు. ఇక ధోనీ అయినా  సిక్సర్లు బాదుతాడు అనుకుంటే కేవలం 1, 2 రన్స్  సరిపెట్టుకోవడం తో చివరికి చెన్నై కి ఓటమి తప్పలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: