అది ధోని గొప్పతనం..?

praveen
భారత క్రికెట్ చరిత్రలో ధోని కి ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది అన్న విషయం తెలిసిందే. భారత్లో క్రికెట్ అనే ఆట మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు ఏ సారధికి  సాధ్యం కాని రీతిలో మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలోని జట్టు ఏకంగా రెండు ప్రపంచ కప్లు సాధించడంతో పాటు... చాంపియన్స్ ట్రోఫీ కూడా సంపాదించింది భారత జట్టు. అంతే కాకుండా ఎన్నో విజయాలను కూడా సాధించి భారత క్రికెట్ ఖ్యాతిని  ప్రపంచానికి చాటిచెప్పింది. అందుకే భారత క్రికెట్లో ధోని కి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. అంతే కాదు ఎంతో మంది ఆటగాళ్లు సైతం ధోని గురించి గొప్పగా చెబుతూ ఉంటారు.

 ధోనీ ఒక ఆటగాడి పై ఎంతో నమ్మకం ఉంచు తాడని... అందుకే ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు ధోనీ సారథ్యంలో ఆడుతున్న ఆటగాళ్లు  తమ  100% ప్రతిభను కనబరిచడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు అంటూ చెబుతూ ఉంటారు. ఇటీవలే ఐపీఎల్ లో వరుస ఓటములు చవిచూసిన ధోనీసేన నిన్న జరిగిన మ్యాచ్ లో మళ్లీ ఫామ్ లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఒక్క వికెట్ కూడా పడకుండానే ఏకంగా మ్యాచ్ ను  గెలిపించారు ఓపెనర్లు. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులందరూ సంతోషం లో మునిగిపోయారు. రాబోయే మ్యాచ్ లలో కూడా ఇలాంటి జోష్ కొనసాగించాలని కోరుకుంటున్నారు.

 అయితే ఇటీవలే చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు బ్రెట్ లి  ప్రశంసలు కురిపించాడు. ధోనీ జట్టులో ఉన్న ఆటగాళ్లపై పూర్తి విశ్వాసాన్ని ఉంచుతాడు అంటూ వ్యాఖ్యానించాడు. సారథిగా అది ధోని గొప్పతనం అంటూ చెప్పుకొచ్చాడు. నిన్న జరిగిన మ్యాచ్లో కెప్టెన్గా ధోనీ ఉంచిన నమ్మకం ప్రోత్సాహంతోనే వాట్సన్ చెలరేగి ఆడాడు  అంటూ చెప్పుకొచ్చాడు బ్రెట్లీ. వరుసగా గత మ్యాచ్లో వాట్సన్ విఫలమైనప్పటికీ ధోని జట్టు నుంచి వాట్సాప్ ను తొలగించకుండా... అతనితోనే ఆడించాడు అని తెలిపాడు . కాగా నిన్న పంజాబ్ తో  జరిగిన మ్యాచ్ లో వాట్సన్  83 పరుగులతో చెలరేగిన విషయం తెల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: