ఒకే ఓవర్లో 77 పరుగులు... ఆ ఘనత ఈ క్రికెటర్‌దే..!
అయితే ఒకే ఓవర్లో 77 పరుగులు వచ్చిన విచిత్ర ఘటన ఫిబ్రవరి 20, 1990న చోటుచేసుకుంది. అయితే ఈ రికార్డు అంతర్జాతీయ మ్యాచ్‌లో కాకుండా ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లో జరిగింది. ఆ రోజు న్యూజిలాండ్‌లోని వెల్లింగ్టన్, కాంటర్బరీ జట్ల మధ్య జరిగిన ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్‌లో వెల్లింగ్టన్ 59 ఓవర్లలో 291 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. 291 పరుగుల లక్ష్య ఛేదనలో కాంటర్బరీ 108 పరుగులకే ఏనిమిది వికెట్లు కోల్పోయింది. ఆ టైంలో ఎల్కే జర్మన్ (160 నాటౌట్), రోజర్ ఫోర్డ్ (14 నాటౌట్) క్రీజ్‌లో ఉన్నారు.
ఇక కాంటర్బరీ జట్టు విజయానికి రెండు ఓవర్లలో 95 పరుగులు చేయాలి. ఆ టైంలో మ్యాచ్ డ్రా చేసుకోవాలని కాంటర్ బరీ భావించింది. అయితే రెండు వికెట్లు తీస్తే గెలవచ్చని వెల్లింగ్టన్ భావించింది. దీంతో ఎలాగైనా గెలవాలని వెల్లింగ్టన్ కెప్టెన్ మెక్ స్వీనే బంతిని బ్యాట్స్‌మన్ రాబర్ట్ వాన్స్‌కు ఇచ్చాడు.
ఆ ఓవర్లో రాబర్ట్ వాన్స్ మొత్తం 22 బంతులు వేయగా.. అందులో 17 నో బాల్స్ ఉన్నాయి.
కాంటర్బరీ బ్యాట్స్‌మెన్ జర్మన్ 8 సిక్సులు, 5 ఫోర్లు బాదడంతో ఆ ఓవర్లో మొత్తం 77 పరుగులొచ్చాయి. ఈ క్రమంలోనే జర్మన్ శతకం కూడా సాధించిడం విశేషం. చివరి ఓవర్లో 18 పరుగులు రావాల్సి ఉండగా.. కేవలం 17 పరుగులు రావడంతో మ్యాచ్ డ్రా అయ్యింది.