న్యూజిలాండ్ టార్గెట్ 164 ఛేదించేనా...?
ఈరోజు న్యూజిలాండ్ లోని మౌంట్ మాంగనీలో జరుగుతున్న మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణిత 20 ఓవర్లకి గాను 3 వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది. ఇందులో ఓపెనర్ గా వచ్చిన సంజూ శ్యాంసన్ కేవలం 2 పరుగులు చేయగా, కాల్ రాహుల్ తన ఫామ్ కి అనుగుణంగా 45 పరుగులు, అలాగే నేటి మ్యాచ్ కెప్టెన్ కాలి నొప్పి కారణంతో 60 పరుగుల వద్ద రిటైర్డ్ తీసుకున్నాడు.
అలాగే తరవాత వచ్చిన శివమ్ దుబే కూడా కేవలం 5 పరుగులకే పరిమితమవ్వగా శ్రేయస్ అయ్యర్ 33 పరుగులతో, మనీష్ పాండే 11 పరుగులతో నాట్ అవుట్ గా నిలిచారు. అలాగే న్యూజిలాండ్ బౌలింగ్ విషయానికి వస్తే కుగ్గేలెజిన్ రెండు వికెట్లు, బెన్నెట్ ఒక వికెట్ తీసుకున్నారు. మరి భారత్ నిర్ణయించిన 164 పరుగులను ఛేదించి ఈ సిరీస్ లో మొదటి విజయాన్ని నమోదుచేస్తుందో లేదు వేచి చూడాలి.
ఒక వేళ న్యూజిలాండ్ కనుక లక్షాన్ని ఛేదించలేకపోతే సిరీస్ టీమిండియా క్లీన్ చేసి 5 - 0 తో సిరీస్ ని కైవసం చేసుకుంటుంది. ఏది ఏమైనా సరే ఆల్ ది బెస్ట్ టీం ఇండియా.