అలా చేస్తే టెస్ట్ క్రికెట్ చచ్చిపోతుంది..?

praveen

క్రికెట్ ఆట కి ప్రపంచ వ్యాప్తంగా ఎంతో క్రేజ్ ఉంటుందన్న విషయం తెలిసిందే. క్రికెట్ మ్యాచ్ వస్తున్నప్పుడు  టీవీల ముందు కూర్చుని  ఆస్వాదించే ప్రేక్షకులు కొంతమందైతే... గ్రౌండ్ కు వెళ్లి డైరెక్ట్ గా ఆస్వాదించే ప్రేక్షకులు ఇంకొంతమంది. కానీ ఎప్పుడూ మ్యాచ్ జరిగినా స్టేడియం మొత్తం ఫుల్ గా కనిపిస్తూ సందడిగా ఉంటుంది. ఇక స్టేడియంలో కూర్చుని తమ తమ అభిమాన ఆటగాడు అద్భుత ప్రదర్శన చేస్తుంటే చూస్తూ ఎంజాయ్ చేసే  ప్రేక్షకులు ఎంతో మంది. ఇకపోతే వన్డే టి20 మ్యాచ్ లలో కంటే టెస్ట్ మ్యాచ్ కి కాస్త అభిమానులు తక్కువగా ఉంటారు. ఎందుకంటే టెస్ట్ మ్యాచ్లు సుదీర్ఘకాలం పాటు జరుగుతాయి కాబట్టి. ఏకంగా టెస్ట్ సిరీస్ 5 రోజుల పాటు జరుగుతూ ఉంటుంది. ఇక టెస్ట్ సిరీస్లను ఆటగాళ్ళు  ఎక్కువగా ఇష్టపడుతుంటారు. 

 

 

 ఎందుకంటే టెస్ట్ సిరీస్ల ద్వారా తమ ఆట ప్రదర్శనలు మెరుగుపరుచుకోవచ్చని ఆటగాళ్లు భావిస్తూ ఉంటారు. టెస్టు మ్యాచుల్లో సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడటానికి ఎంతో ఆస్కారం వుంటుంది. అందుకే టెస్ట్ మ్యాచ్లు ఆగడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు ఆటగాళ్లు. ఇకపోతే ఎన్ని రోజుల వరకు టెస్ట్ మ్యాచ్ లను  ఐదు రోజులు నిర్వహించేవారు. కానీ టెస్ట్ మ్యాచ్ లను  ఐదు రోజుల నుండి నాలుగు రోజులకు కుదించాలని ఐసీసీ  భావిస్తోంది. అయితే ఐసీసీ నిర్ణయం పై మాత్రం చాలా మంది దిగ్గజ క్రికెటర్లు  వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. టెస్ట్ క్రికెట్ ను  ఒకరోజు కుదించడం వల్ల చాలా సమయం మిగులుతుందని... దీన్ని టి20 వంటి  లాభదాయకమైన ఫార్మాట్లకు  ఉపయోగించుకోవచ్చు అనేది ఐసీసీ అభిప్రాయం. కానీ ఐసీసీ అభిప్రాయాన్ని క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, రికీ పాంటింగ్ షోయబ్ అక్తర్ వంటివారు వ్యతిరేకిస్తున్నారు. 

 

 

 తాజాగా ఐసీసీ నిర్ణయాన్ని వ్యతిరేకించే వారిలో శ్రీలంక స్టార్ బ్యాట్స్ మెన్ జయవర్దనే చేరారు. టెస్ట్ క్రికెట్ ను ఎక్కువగా పాపులర్ చేయాలని భావనతోనే డే అండ్ నైట్ టెస్ట్లు రూపొందించారని... మళ్లీ ఇప్పుడు నాలుగు రోజులు టేస్ట్ మ్యాచ్ అంటూ నిర్ణయం  తీసుకుంటున్నారని జయవర్ధనే మండిపడ్డారు. తమ సొంత లాభాల కోసం టెస్టు సిరీస్ ను  ఇలా మార్చుకుంటూ పోతే చివరికి టెస్ట్ క్రికెట్ చచ్చిపోతుంది అంటూ ఆయన వ్యాఖ్యానించారు. టెస్ట్ క్రికెట్ ని ఐదు రోజుల నుండి నాలుగు రోజులకు మార్చాలని ఐసీసీ నిర్ణయానికి తాను వ్యతిరేకం అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు శ్రీలంక మాజీ స్టార్ బ్యాట్స్మెన్  జయవర్దనే . కాగా  దిగ్గజ క్రికెటర్ ల  నుంచి వ్యతిరేకత ఎదురవుతుండంతో ఐసీసీ ఈ కొత్త నిర్ణయంతో ఎలా స్పందించాలో అన్నది ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: