చిక్కుల్లో పడ్డ భారత క్రికెటర్లు శ్రేయాస్ అయ్యర్, శివమ్ దూబే..?

praveen

మన దేశంలో క్రికెట్ ఆటకు ఉండే పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏ ఆటకు లేనంత క్రేజ్  మన దేశంలో ఒక క్రికెట్ కు మాత్రమే ఉంది. ప్రపంచం మొత్తంలో మన దేశంలో ఉన్నంత క్రేజ్ క్రికెట్ కి ఏ దేశంలో లేదు అనడంలో అతిశయోక్తి లేదు. దేశవ్యాప్తంగా కోట్లమంది క్రికెట్ వీక్షిస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. క్రికెట్ వస్తుందంటే చాలు టీవీలకు అతుక్కుపోతుంటారు. ఇకపోతే గత కొంత కాలం నుంచి టీమిండియా జట్టు దూసుకుపోతున్న విషయం తెలిసిందే. వరుస  సిరీస్ లను  సొంతం చేసుకుంటూ తన సత్తా చాటుతూ.. టీమ్ ఇండియా జట్టుకు   ఎదురు లేదు  అని నిరూపిస్తూ దూసుకుపోతుంది టీమిండియా జట్టు. అందరు ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన చేస్తూ టీమిండియాకు విజయాలను అందిస్తూ ఉంటే టీవీల ముందు కూర్చున్న ప్రేక్షకులందరూ ఆనందంలో మునిగిపోతున్నారు . 

 

 

 

 అయితే టీమిండియాలో కి యువ ఆటగాళ్లు వస్తున్న విషయం తెలిసిందే. సీనియర్లు కొంచెంకొంచెంగా తగ్గుతూ యువ  ఆటగాళ్లు జట్టులో స్థానం కల్పించుకొని తమ సత్తా చాటుతున్నారు. ఈ క్రమంలోనే స్పిన్నర్ రాహుల్ చాహర్ ... ఐపీఎల్ లో తన సత్తా చాటుకుని ఇండియా జట్టులో స్థానం సంపాదించుకున్నాడు. అంతేకాకుండా శ్రేయస్ అయ్యర్ శివం దూబేలు  కూడా ప్రస్తుతం టీమిండియా జట్టులో స్థానం సంపాదించుకున్నారు.  ప్రతి మ్యాచ్ లో  అద్భుత ప్రదర్శన చేస్తూ జట్టులో తమ స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు ఈ యువ ఆటగాళ్లు. టీమిండియా జట్టు చిక్కుల్లో ఉన్నప్పుడు చెలరేగి  ఆడి టీమిండియాను విజయాలవైపు నడిపిస్తున్నారు యువ  ఆటగాల్లైనా  శ్రేయస్ అయ్యర్ శివం దూబే లు . 

 

 

 

 అయితే ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ శివం దూబేలు  చిక్కుల్లో పడ్డారు. వచ్చే నెల 5 నుంచి జరగనున్న శ్రీలంక సిరీస్ లో  శివం దూబే  శ్రేయస్ అయ్యర్ లు ఆడాల్సి ఉంది.  దీంతో భారత యువ క్రికెటర్ లు  అయిన శ్రేయస్ అయ్యర్ శివం దూబేలు  చిక్కుల్లో పడ్డారు. తాజాగా రైల్వేస్ టీమ్,  ముంబై జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. అయితే ఈ రంజీ మ్యాచ్లో ముంబై తరఫున ఈ  ఇద్దరు ఆటగాళ్లను ఆడాల్సి  ఉంది. కానీ ఇద్దరు ఆటగాళ్ళు రంజీ మ్యాచ్లో ముంబై తరఫున ఆట లో పాల్గొనలేదు. దీంతో అనుమతి లేకుండా మ్యాచ్  డుమ్మా  కొట్టినందుకు గాను ఇద్దరు ఆటగాళ్లపై ముంబై క్రికెట్ అసోసియేషన్ చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: