హనుమంతుడిని ఇలా పూజిస్తే.. ఎన్నో ఫలితాలు..?

హనుమంతుడు.. ఎందరికో ఇష్టదైవం.. దాస్యభక్తికి ప్రతీక. విశ్వాసం, నమ్మకం అనే గుణాలకు నిలువెత్తు రూపం. అంతేనా హనుమంతుడిని తలచుకుంటేనే ఎంతో ధైర్యం, శక్తి కలుగుతాయి. మరి అలాంటి హనుమంతుడిని హునుమ జయంతి రోజు ఎలా పూజించాలి..?



హనుమజ్జయంతినాడు భక్తులు ఆచరించాల్సిన విధివిధానాల్ని గురించి శౌనక సంహిత వివరించింది. పంచామృతాలతో స్వామి విగ్రహాన్ని అభిషేకించాలి. నువ్వుల నూనె కలిపిన సిందూరాన్ని ఆ ఆకృతికి పులమాలి. తమలపాకులతో అష్టోత్తర సహితంగా ఆరాధించాలి.



పానకం, వడపప్పు, అప్పాలు, అరటిపండ్లు వంటి పదార్థాల్ని హనుమకు నైవేద్యంగా సమర్పించాలి. హనుమత్ జయంతి రోజు మాత్రమే కాదు.. ప్రతి మంగళవారం, శనివారాలు హనుమపూజకు అనుకూలమైన రోజులు. ఎందుకంటే.. ఐశ్వర్య లబ్ధికి మంగళవారం, ఆరోగ్యసిద్ధికి శనివారం ఆ కేసరి నందనుణ్ని నియమబద్ధంగా పూజించాలి.



బుద్ధి, బలం, యశస్సు, ధైర్యం, నిర్భయత్వం, ఆరోగ్యం, చైతన్యం, వాక్పటిమ- ఈ ఎనిమిది గుణాల కలబోత హనుమంతుడు. రజోగుణంతో భాసిల్లుతూ సత్వగుణంతో శోభిల్లే హనుమ అందరికీ ఆదర్శనీయుడు. ఆలోచన, ఆచరణ, విశ్లేషణ, వివేచన, పరిశీలన వంటి దశల్ని ఏ పనిలోనైనా సమగ్రంగా అమలు చేయడం ద్వారా విజయాన్ని అందుకోవచ్చని హనుమంతుడు ప్రపంచానికి చాటాడు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: