ముక్కోటి ఏకాదశి రోజున ఈ పని చేశారా..ఐశ్వర్యంతా మీదే..!
ముక్కోటి ఏకాదశి రోజున ఉదయం లేవగానే ఇల్లు వాకిలి శుభ్రం చేసి, విష్ణువును ఆరాధించాలి.వైకుంఠ ఏకాదశి రోజున కచ్చితంగా ఉపవాసం ఉన్నట్టయితే చాలా మంచిది.మరియు ఈ రోజున రాగి ఆకులతో తయారుచేసిన తోరణం కట్టడం వల్ల,మన ఇంట్లో నెగటివ్ ఎనర్జీ మరి వెళ్ళిపోయి,లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది.పూర్వం రోజుల్లో మురాసురుడు అనే రాక్షసుడునీ వధించడానికి విష్ణుమూర్తి వస్తూ ఉంటే ఆ రాక్షసుడు వెళ్లి బియ్యంలో దాక్కున్నట్టు చెబుతారు. దానివల్ల ప్రతి ఒక్కరూ ఈ రోజున బియ్యంతో తయారు చేసిన ఆహార పదార్థాలను అస్సలు తీసుకోకూడదు.ఆ తరువాత లక్ష్మీనారాయణ ని పూజించి,ఆ రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం వేళలో రాగి ఆకుపై పసుపు,కుంకుమ వేసి,ఆ తరువాత ఒక ప్రమిదను పెట్టాలి.
ఆ తర్వాత ఏదైనా గుడికి వెళ్లి వైకుంఠ ద్వారంలో నుంచి నారాయణ్ణి దర్శనం చేసుకోవడం వల్ల సకల పాపాలు తొలగి,అష్టైశ్వర్యాలు కలుగుతాయని వేద పండితులు చెబుతున్నారు.వైకుంఠ ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నవారు ద్వాదశి రోజున ఎవరికైనా ఒకరికి ఇంటికి ఆహ్వానించి,భోజనం పెట్టడంతో వారి ఉపవాసం ముగుస్తుంది.దీనివల్ల సకల పాపాలు హరించకపోయి, అస్టైస్వర్యాలు మన ఇంట్లోకి అడుగు పెడతాయని చాలామంది ఆచరించి మరీ నిరూపించారు.కావున మీరు కూడా వైకుంఠ ఏకాదశి రోజున ఈ పనులను చేసి కచ్చితంగా నారాయణ కృపకు పాత్రులు కండి.