పుష్ప 2: కొత్త చాప్టర్ షుర్ అంటూ లేడీ కొరియోగ్రాఫర్ సంచలన పోస్ట్..!
పుష్ప 2 చిత్రంలోని టైటిల్ సాంగ్స్ కి విజయ్ పోలికతో పాటుగా శ్రేష్ట కూడా కొరియోగ్రాఫర్ గా పని చేసిందట. ఈ సాంగ్ ఫుల్ వీడియో ఇటీవలే విడుదల చేయగా అందుకు సంబంధించి ఇమే సోషల్ మీడియాలో ఒక పోస్టుని షేర్ చేయడం జరిగింది. దీంతో ఒక్కసారిగా ఈమె మరొకసారి వైరల్ గా మారుతున్నది. తాజాగా శ్రేష్ట తన ఇంస్టాగ్రామ్ ఒక పోస్టును అయితే షేర్ చేసింది.. అందులో తన పుట్టినరోజు సందర్భంగా డైరెక్టర్ సుకుమార్ తో పాటు,చిత్ర బృందానికి కేక్ కట్ చేసిన ఫోటోలను షేర్ చేసింది.
పుష్ప 2 చిత్రంతో నా జీవితం ఒక కొత్త అధ్యాయానం ప్రారంభిస్తున్నాను అంటూ వెల్లడించింది శ్రేష్ట. దీంతో ఈ పోస్ట్ వైరల్ గా మారడంతో కొంతమంది నెటిజెన్స్ ఈ పోస్టులకు ఇలా కామెంట్స్ చేస్తూ ఈసారి ఎవరిని బకరా చేస్తావో పిల్ల అంటూ లవ్ ఎమోజీలతోపాటు ఫన్నీ ఎమోజీలను షేర్ చేస్తూ ఉన్నారు. జర జాగ్రత్త పిల్ల సినీ ఇండస్ట్రీలో ఎక్కువ రోజులు ఉండలేవు అంటూ ఆమె ఏకీపారేయడం జరుగుతోంది. జానీ మాస్టర్ వ్యవహారంలో ఒక్కసారిగా వైరల్ గా మారిన శ్రేష్ట హీరోయిన్ రేంజిలో పాపులారిటీ సంపాదించుకున్నది. ఇప్పటికీ కూడా ఈమెకు సంబంధించిన రిల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూ ఉంటాయి.