"ఎవ్వడు ఏం పీకలేరు"..టైం చూసి కొట్టిన స్టార్ తెలుగు హీరో..!

Thota Jaya Madhuri
హీరో నాని అంటే ఒక ప్రత్యేకమైన పేరు ఉంటుంది. సాధారణంగా ఎవరి జోలికి పోడు. తన జోలికి వస్తే అంత ఈజీగా వదలడు . ఆ విషయం అందరికీ తెలిసిందే . టాలెంట్ నే నమ్ముకొని ఇండస్ట్రీలోకి వచ్చిన వన్ ఆఫ్ ద స్టార్ నాచురల్ స్టార్ నాని . ఎటువంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీ లోకి రావడమే కాకుండా మొదటగా అసిస్టెంట్ డైరెక్టర్గా ఆ తర్వాత హీరోగా ఆ తర్వాత స్టార్ గా ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా మారిపోయి చక్రం తిప్పుతున్నాడు . ప్రజెంట్ నాని ఖాతాలో మూడు బడా సినిమాలో ఉన్నాయి .


మూడు కూడా హిట్ అయ్యే సినిమాలే . అయితే నాని చాలా సరదా సరదాగా ఉంటాడు అన్న విషయం కూడా అందరికీ తెలుసు.  కాగా రీసెంట్గా నాని సరిగమప ది నెక్స్ట్ సింగింగ్ యూత్ ఐకాన్ షో గెస్ట్ గా వెళ్లారు. సరిపోదా శనివారం అనే స్పెషల్ పేరుతో ఈ ఎపిసోడ్ నిర్వహిస్తున్నారు మేకర్స్ . ఇందుకు సంబంధించిన ప్రోమోని కూడా రిలీజ్ చేశారు . అయితే ఈ షోలో చాలా సరదా సరదాగా మాట్లాడాడు నాని . నానితో పాటు ప్రియాంక మోహన్ కూడా సందడి చేసింది. తనదైన స్టైల్ లో ఆకట్టుకున్నింది.


అంతేకాదు నాని దసరా లోని పాట కూడా పాడి ఇంప్రెస్ చేశారు . ఇదే క్రమంలో నాని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ కూడా చేశారు. " ఏఐ వచ్చేస్తుంది మ్యూజిక్ లోకి అంటూ ఫ్యూచర్ ఏంటి సింగర్స్ కి .. అలా డిస్కషన్ జరిగింది .అప్పుడు నాని ఈరోజు ఇక్కడ కూర్చుని వాళ్ళు పాడుతున్నది చూస్తూ ఉంటే.. ఏఐ ఏం పీకలేదు అని చెప్పాడు".  దీంతో ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారాయి. నాని నోటి నుండి ఇలాంటి కామెంట్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు.  అయితే అది చాలా సరదాగా మాట్లాడిన మాటలు అంటూ కూడా ఫ్యాన్స్ కవర్ చేస్తున్నారు. అయితే ఇదే డైలాగ్ ని కూసింత ఘాటుగా ఫ్యాన్స్ మరో హీరో విషయంలో అప్లికెబుల్ చేసి మరి వాడేస్తున్నారు. మా హీరో ని ఎవ్వరు ఏం పీకలేరు.."అది ఏఐ కాదు దాని మమ్మి కాదు" అంటూ బోల్డ్ గా ట్రెండ్ చేస్తున్నారు..!


" height='150' width='250' width=" data-framedata-border="0" height="391" src="https://www.youtube.com/embed/IO-xNqAOnRI" title="Saripodha Sanivaaram Special | SAREGAMAPA-The Next Singing Youth Icon PROMO | Sun 8:30PM | ZeeTelugu">

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: