సపోర్టివ్ రిలేషన్ త‌ప్ప‌క కావాలి.. ఎందుకో తెలుసా..?

lakhmi saranya
వ్యక్తిగత సమస్యలతోనో, వృత్తిపరమైన సవాళ్లతోనో మీరు సఫర్ అవుతుండవచ్చు. పని ఒత్తిడితోనో, అనారోగ్యంతోనో అవస్థలు పడుతుండవచ్చు. ఏదైనా ప్రాబ్లం లో చిక్కుకొని, ఎలా బయటపడాలో తెలిక, ఎవరికి చెప్పుకోలేక లోలోన కుమిలిపోతూ ఉండవచ్చు. ఇలాంటి అప్పుడే మిమ్మల్ని ఆ సమస్యల నుంచి బయట పడేయటంలో సపోర్టివ్ రిలేషిప్స్ కీలక పాత్ర పోషిస్తుంటాయని సైకాలజిస్టులు అంటున్నారు. నిజానికి ప్రతి ఒక్కరికి ఎన్నో పరిచయాలు ఉంటాయి. అందులో స్నేహితులు, బంధువులు, కొలీగ్స్ ఇలా చాలామంది ఉండి ఉంటారు. కానీ మీరేదైనా ఆపదలో ఉన్నప్పుడు, నిరాశ నిరుత్సాహాల్లో కూరుకుపోయి ఏమీ తోచనప్పుడు మాత్రం కొందరు, ఒక్కరో మాత్రమే మీకు సపోర్ట్ గా ఉంటారు.
 మిమ్మల్ని ఇబ్బందుల నుంచి బయటపడేయాలని చూస్తుంటారు. పరిష్కార మార్గం వెతుకుతుంటారు. ఇదే సపోర్టివ్ రీలేషిప్ కు చక్కటి ఉదాహరణ అంటున్నారు నిపుణులు. అంటే ఎలాంటి పరిస్థితుల్లోనైనా మద్దతుగా గాలిచే ఒక వ్యక్తి గాని, అందరూ వ్యక్తులు గాని ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటారు. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మానసిక, శారీరక ఆరోగ్యాలపై మానవ సంబంధాల ప్రభావం ఉంటుందని ఆధ్యాయణాలు పేర్కొంటున్నాయి. కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు, సహచరులు... ఇలా ఎవరైనా కావచ్చు. వారికి మీకు మధ్య పాజిటివ్ అండ్ సపోర్టివ్ రిలేషన్షిప్స్ కలిగి ఉన్నప్పుడు మీరు ఆనందంగా ఉండగలుగుతారని నిపుణులు అంటున్నారు.
పాజిటివ్ రిలేషన్స్ అంటే ఎక్కడ మీకు ఎల్లప్పుడూ సపోర్టివ్ గా ఉండే మానవ సంబంధాలు అని అర్థం. మీరు ఆపదలో ఉన్నప్పుడు, అవస్థలు పడుతున్నప్పుడు ఈ సంబంధాలు మిమ్మల్ని గట్టెక్కించడంలో సహాయపడతాయని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోసైన్సెస్ కు చెందిన నిపుణులు అంటున్నారు. మానసిక ఒత్తిళ్లు, శారీరక అనారోగ్యాల వేళ జీవిత భాగస్వామి, కుటుంబం లేదా సన్నిహితుల రూపంలో బలమైన సపోర్టింగ్ వ్యవస్థాను కలిగి ఉన్నవారు, అలాంటి సపోర్ట్ లేని వారితో పోలిస్తే ఎక్కువ బాధలను ఎదుర్కొంటారని, ఇది వారి అనారోగ్యాలకు, ఆయు క్షీణతకు కారణం అవుతుందని నిపుణులు అంటున్నారు. అందుకే మీకంటూ ఒక సపోర్టివ్ సిస్టమ్ మానవ సంబంధాల రూపంలో ఉండాలి. ఒంటరితనం వేధిస్తున్నప్పుడు, కుటుంబ, ఆర్థిక సమస్యలు వెంటాడుతున్నప్పుడు కొందరికి ఏవి తోచకపోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: