నరద్రుష్టి పోగొట్టడానికి ఏమి చేయాలో తెలుసా..?

Divya
ఒక్కోసారి మనం ఎంత కష్టపడినా,ఎన్ని పూజలు చేసినా నరద్రుష్టి దోషాల వల్ల చేసినా,కష్టానికి తగ్గ ప్రతిఫలం రాక ఎన్నో ఇబ్బందులను పడుతుంటాము.ఆర్థిక పరిస్థితులు కూడా నర ద్రుష్టిదోషాల వల్ల చాలా ఇబ్బందికరంగా తయారవుతాయి.ఏ పనిని పట్టుకున్న విజయం సాధించలేక మానసిక వ్యధ కలుగుతుంది.నర ద్రుష్టి కారణంగా,మనకు తెలియకుండానే ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
అటువంటి నరద్రుష్టిని కొన్ని రకాల పరిహారాలతో మనం పోగొట్టుకోవచ్చు.ముఖ్యంగా కొబ్బరికాయలతో చేసే పరిహారాలు ఆర్థిక ఇబ్బందుల నుండి,మానసిక సమస్యల నుండి కాపాడుతుంది.హిందూ సంప్రదాయంలో కొబ్బరికాయకు చాలా పవిత్రమైన స్థానం ఉంది.హిందువుల ఇళ్ళల్లో ఏలాంటి శుభకార్యం జరగాలన్నా,కొబ్బరికాయ కొట్టందే ముందుకు సాగదు.

ఇంట్లో దేవుడికి పెట్టె కలశాలలో పెట్టడానికి కూడా కొబ్బరి కాయలను వాడతారు.ఆ కొబ్బరికాయనే లక్ష్మిదేవి ప్రతి రూపంగా భావిస్తారు.అంతేకాక ఆ లక్ష్మిదేవికి కూడా కొబ్బరికాయంటే చాలా ఇష్టమట.అందువలనే పూజలో కొబ్బరికాయకు ప్రత్యేకమైన స్థానం ఇస్తారు.తట్టుకోలేని ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు లక్ష్మీదేవికి ప్రతి శుక్రవారం పూజలు నిర్వహించి,కొబ్బరికాయ కొడితే, వాటి నుండి తొందరగా ఉపశమనం కలుగుతుంది.
నరదృష్టితో బాధపడేవారు అమావాస్య రోజున కొబ్బరికాయకు నల్లటి కాటుక పెట్టి,మన ఇంటి సభ్యుల చుట్టూ మరియు ఇంటి చుట్టు తిప్పి,దానిని ఏదైనా నీటి ప్రవాహంలో పడేస్తే, మనపై ఉండే నెగటివ్ ఎనర్జీ ప్రభావం తగ్గి,నరదృష్టికి విరుగుడు కలుగుతుంది.

ఉద్యోగ రాక ఇబ్బంది పడేవారు,శుక్రవారం నాడు లక్ష్మీదేవికి తామర పువ్వులను,ఎర్రటి వస్త్రాలను సమర్పించి,పూజలు చేయాలి.ఆ తర్వాత ఒక ఎర్రటి గుడ్డముక్కలో కొబ్బరికాయను ఇంటి గుమ్మానికి కట్టాలి. ఇలా కట్టడం వల్ల నర ద్రుష్టి దోషాలు తొలగి, అనుకున్న పని తొందరగా జరుగుతుంది.
వ్యాపార సమస్యల నుండి బయట పడటం కోసం మంగళవారం నాడు కొబ్బరికాయ తీసుకొని, దానిపై ఎర్రటి కుంకుమతో స్వస్తిక్ వేసి,ఎర్రటి గుడ్డలో ఉంచి,హనుమంతునికి కొబ్బరికాయను సమర్పించాలి. ఇలా ఏడు వారాల పాటు చేయడం వల్ల, నరద్రుష్టి తొలగి, వ్యాపారం సజావుగా జరిగి లాభాలను పొందుతుంది.మరియు ఇలా చేస్తే ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: