లక్ష్మీదేవి తొందర్లోనే మన ఇంటి తలుపు తట్టబోతుందని మనకు అదృష్టం రాబోతోందని అని చెప్పటానికి సంకేతంగా కొన్ని విషయాలు ముందే మనకు గుర్తు లాగా కనిపిస్తాయి. ఏంటో తెలుసుకుందామా..? ఎప్పుడైనా సరే లక్ష్మీదేవి ఆగమనం తొందర్లోనే లభిస్తుంది. ఆ తొందర్లోనే అదృష్టం పట్టబోతుంది అంటే ఈ సంకేతాలు మనకు కనబడతాయి. మరి ఆ సంకేతాలు ఏంటంటే ఎవరికైనా సరే ఉదయం పూట నిద్ర లేవగానే అనుకోకుండా కొబ్బరికాయ కనిపిస్తే మాత్రం ఇక తొందర్లోనే మీకు అదృష్టం రాబోతుందని, చాలా మంచి జరగబోతుందని అర్థం చేసుకోవచ్చు. అలాగే మనం ఉదయం పూట నిద్ర లేవగానే బయటకు వెళ్ళగానే మనకు తెలియకుండా ఒక తెల్లటి పక్షి మనకు కనిపించినట్లయితే దీన్నిబట్టి కూడా మనకు తొందరలో అదృష్టం పట్టబోతుంది.
అని చెప్పవచ్చు. అలాగే పొద్దున్నే నిద్ర లేవగానే మనం బయటకు వచ్చినప్పుడు మంచిగా గడ్డి మేస్తూ ఆవు కనిపిస్తే మన ధనవంతులు అవుతున్నామని సంకేతంగా చెప్పవచ్చు. ఇక తొందర్లోనే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వస్తుంది అని చెప్పవచ్చు. ఆవు అనేది సకల దేవత సంకేతము. ఇందులో కొబ్బరికాయ అంటే మాత్రం శివుడికి ఎంతో ఇష్టమైనటువంటి ప్రీతి పాత్రం. అలాగే తెల్లటి పక్షి అనేది శాంతి సంకేతం. ఇంకొంతమందికి రాత్రిపూట కలలో పాములు కనిపిస్తూ ఉంటాయి. ఇలా కనిపిస్తే చాలామంది ఏమైనా సర్పదోషాలు ఉంటాయి అనుకొని భయపడిపోతుంటారు. అయితే ఇందులో కూడా మనకు కలలో పాము ఏ విధంగా కనిపించింది ఏ పొజిషన్లో కనిపించింది దాన్ని బట్టి కూడా మనకు తొందరలో అదృష్టం పట్టబోతుంది లేదా సర్ప దోషం ఉందా అనేది మాత్రం తప్పకుండా తెలుసుకోవచ్చు. మన కలలో శ్వేత నాగు అనేది కనిపిస్తే మాత్రం చాలా మంచిది అని చెప్పవచ్చు. తెల్లని పాము మనకు కలలో కనిపించింది అంటే మనకు రాజయోగం మాత్రం తప్పకుండా వస్తుంది.
అలాగే బంగారపు, గోధుమ రంగు పాము కనిపిస్తే మనకు తొందర్లోనే లక్ష్మీదేవి రాబోతుందని అర్థం వస్తుంది. అలాగే పాము మనకు పడగవిప్పినట్టు కనిపిస్తే మాత్రం తొందర్లోనే మీకు అద్భుతమైన ఒక అధికారానికి వెళ్లిపోతున్నారని చెప్పవచ్చు. మరి ఇంకొంతమందికి కలలో పాము కాటేసినట్టు కనిపిస్తుంది. తొందరలో మీకు వద్దన్నా కానీ ధనం వస్తూనే ఉంటుంది. ఒకవేళ పాము కనిపించి పాక్కుంటూ వెళ్లి పోతే మనకు పాము దోషం ఉన్నది అని అర్థం చేసుకోవాలి.