రేపట్నుంచి అక్కడ బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం..!!
ఈ నెల 22వ తేదీ నుంచి వచ్చే నెల నాలుగో తేదీ వరకు మల్లన్న స్వామి దర్శనం ఉంటుంది కనుక భక్తులు ఆన్లైన్లో మాత్రమే టికెట్లను బుక్ చేసుకోవాల్సిందిగా ఆలయ EO లవన్న తెలియజేశారు. ఆన్ లైన్ లో శ్రీ పాద దర్శనం-200 రూపాయలుగా.. అతి శ్రీ పాద దర్శనం -500 రూపాయలుగా ఉన్నవి. ఇక అంతే కాకుండా ఉచిత దర్శనం టికెట్లు కూడా అందుబాటులో ఉన్నాయని తెలియజేశారు. ఉచిత దర్శనం టికెట్లు రోజుకి 5000 అందుబాటులో ఉంటాయట.. ఇక అదనంగా మరొక రెండు వేలు కూడా ఇతర టికెట్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు.
రేపు ఉదయం 9 గంటలకు శ్రీశైలం లో అంకురార్పణ చేయనున్నారు.. ఈనెల 23వ తేదీ నుంచి స్వామి అమ్మవార్లకు వాహన సేవలు నిర్వహించనున్నారు. ఇక ఇలాంటి ఉత్సవాలలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు అక్కడ అధికారులు తగిన చర్యలు తీసుకుంటున్నారు. అంతేకాకుండా కరోనా నిబంధనలను పాటించని భక్తులకు కూడా తెలియజేస్తున్నారు. ఇక అందుకు తగిన ఏర్పాట్లను కూడా అక్కడ అధికారులు పూర్తి చేయనున్నట్లు సమాచారం. అయితే ఎవరైనా ఈ బ్రహ్మోత్సవాలకు వెళ్లాలనుకునే వారు కోవిడ్ నిబంధనలను పాటించాల్సిందిగా కోరుతున్నాము.