భక్తి: పూజలో అగరవత్తులు ఎందుకు వెలిగిస్తారో తెలుసా..??

N.ANJI
భారతదేశం హిందూ సంప్రదాయాలకు పెట్టింది పేరు అన్నట్టుగా ఉంటుంది. అయితే మన హిందూ సంప్రదాయం ప్రకారం దేవుడికి పూజలు, వ్రతాలు చేసుకొనే సమయంలో అగరవత్తులను వెలిగించటం సర్వ సాధారణమైనా విషయమే. అయినప్పటికీ దేవుడికి అలా వెలిగించటం వెనక శాస్త్రీయమైన కారణాలు ఉన్నాయని చెప్పుకొస్తున్నారు. ఆ కారణాలు ఏంటో ఒక్కసారి చూద్దామా.
మన పూర్వీకులు ఏ పని చేసిన దాని వెనుక శాస్త్రీయమైన కారణం ఉంటుంది. అలాంటి ఆనవాయితీలలో ఇది ఒక్కటి అని చెప్పాలి. అయితే పురాతన భారతీయ సంప్రదాయంలో అగరవత్తులను వెలగించడం వల్ల గది అంతా సువాసనతో నిండి ఉంటుందన్న సంగతి అందరికి తెల్సిందే. కాగా.. ఆ రోజుల్లో ఉపయోగించే అగరబత్తిలలో ఔషధ గుణాలు ఉండేవంటా,. వాటిలో ముఖ్యంగా వాటిలో గుగ్గిలం, సాంబ్రాణి వంటి వాటిని ఎక్కువగా వాడుతూ ఉండేవారంట. ప్రస్తుతం ఈ రోజుల్లో కూడా  వీటిని ఎక్కువగానే ఉపయోగిస్తున్నారు.
అంతేకాదు.. బోస్విలియా చెట్టు లభించే జిగురు నుంచి సాంబ్రాణిని తయారు చేస్తుంటారు. ఇక సాంబ్రాణి నుంచి వెలువడే సువాసన మెదడులోని టీర్పీవీ3 అనే ప్రొటీన్‌పై ప్రభావం చూపుతుందని ఆధ్యాతిక గురువులు చెబుతున్నారు. అలాగే చర్మం కింద మృదువైన స్పర్శకు అవసరమైన స్రావాలను ఈ ప్రొటీన్ విడుదల చేసి ఒత్తిడిని అదుపులో ఉంచుతుందని తెలిపారు.
అయితే గుగ్గిలం విషయానికి వస్తే అథర్వణ వేదంలోనూ కూడా దీని గురించి తెలిపారు. ఇక గుగ్గిలం చెట్ల నుంచి మండు వేసవిలో లభించే జిగురు ద్వారా గుగ్గిలంను తయారు చేస్తుంటారు. కాగా.. ఇది క్రిమిసంహారిగానే కాదు, రక్తస్రావాలను నివారించే లక్షణాలను కలిగి ఉంటుందని తెలిపారు. అంతేకాదు.. సాంబ్రాణి, గుగ్గిలంతో తయారుచేసిన అగరబత్తులను వెలిగించినప్పుడు గాలిలో కాలుష్యాన్ని నివారిస్తుందని తెలిపారు. ఇక అగరవత్తుల సువాసన కారణంగా మనస్సు ప్రశాంతంగా ఉండి ఏకాగ్రతను పెంచడమే కాకుండా.. వాటి నుండి వెలువడే సువాసనతో చుట్టూ ఉన్న పరిసరాల్లో పాజిటివ్ వేవ్స్ అందిస్తూ.. నెగిటివ్ వేవ్స్ ని దూరం చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: