విష్ణువుకు పూజలో ఏ పువ్వును సమర్పించాలో తెలుసా ?
సనాతన ధర్మ గ్రంథాల ప్రకారం కదంబ పుష్పాలు విష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైనవి. కదంబ పుష్పాన్ని చూసి చాలా సంతోషిస్తారు. కదంబ పుష్పంతో స్వామిని పూజించే భక్తులకు మరణానంతరం యమరాజు బాధలు తప్పుతాయని నమ్మకం. అదే సమయంలో విష్ణువు తన కోరికలన్నీ తీరుస్తాడు.
విష్ణువును గులాబీ పువ్వుతో పూజించడం వల్ల నారాయణుడితో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. మరోవైపు తెలుపు మరియు ఎరుపు కనేర్ పువ్వులతో పూజించే వారిని దేవుడు చాలా సంతోశించి ఆశీర్వదిస్తాడు. మరోవైపు ఇంద్రుడు కూడా అగస్త్య పుష్పంతో నారాయణుడిని పూజించే భక్తులకు మంచి చేకూరేలా చేస్తాడని నమ్మకం.
నారాయణుని కి నిత్యం తులసి దళాన్ని సమర్పించడం వల్ల పది వేల జన్మల పాపాలు నశిస్తాయి. కానీ ఆదివారాలు, ఏకాదశి నాడు తులసి ఆకులను తెంపొద్దు. ఇది కాకుండా ఏకాదశి నాడు శమీ పత్రంతో పూజించే వారు యమరాజు భయంకరమైన మార్గాన్ని సులభంగా దాటుతారు.
పసుపు, ఎరుపు తామర పువ్వులతో స్వామిని పూజించిన వారికి స్వర్గంలో స్థానం లభిస్తుంది అంటారు. బకుల్, అశోక పుష్పాలతో పూజించిన వారికి శోకము లేదు. విష్ణువును చంపక పువ్వుతో పూజించిన వారు జీవన్మరణ చక్రం నుండి విముక్తి పొందుతారు. మరోవైపు బంగారంతో చేసిన కేతకీ పుష్పాన్ని దేవుడికి సమర్పించడం వల్ల కోటి జన్మల పాపాలు నశిస్తాయి. ముఖ్యంగా తామర పువ్వు లక్ష్మీ దేవికి ప్రీతీ పాత్రమైనది. కాబట్టి తామర తో విష్ణువును పూజిస్తే ఇద్దరినీ పూజించినట్లే. అందుకే తామర పువ్వుల కు విష్ణువు పూజలో విశిష్టమైన స్థానం ఉంటుంది.