కార్తీక మాసంలో పూజ ఏ విధంగా చేయాలంటే.

Divya
నిన్నటి రోజు నుండి కార్తీక మాసం ప్రారంభమైంది. ఈనెల చాలా పవిత్రమైనది..కార్తీక మాసాన్ని దేవ దీపావళి అని కూడా అంటారట. ఎక్కువగా ఈ నెలలో దీపాలను వెలిగిస్తూ వుంటారు. ఇక ఈ కార్తీకపౌర్ణమి రోజున ముఖ్యంగా శివునికి, విష్ణుమూర్తికి చాలా ఇష్టమైన రోజులట. ముఖ్యంగా ఈ రోజున భక్తిశ్రద్ధలతో పూజలు చేసి, దీపాలు వెలిగిస్తే మనం కోరుకునే విధంగా ఫలితాలు అందుతాయి.

మనం తెలియక చేసిన కొన్ని పాపాలు ఈ మాసంలో పూజలు చేస్తే తొలగిపోతాయట. ముఖ్యంగా ఈ నెలలో సత్యనారాయణ వ్రతం చేస్తే చాలా పుణ్యం లభిస్తుందట. ప్రతిరోజు నదీ స్నానం చేసి ఆ తర్వాత పూజ గదిలో దీపాలను వెలిగించి, తులసి చెట్టు దగ్గర మరొక దీపాన్ని వెలిగిస్తే.. చాలా మంచి జరుగుతుందట. ఇక ఇలా వెలిగించిన దీపాలను ఏదైనా నదిలో కాని, ఎటువంటి కాలువలో కానీ అరటి ఆకు మీద పెట్టి వదిలితే చాలా మంచిదట.
ఇక ఈ మాసంలో ఏదైనా శివాలయంలో మనం దీపాలను వెలిగిస్తే మంచి ఫలితం దక్కుతుంది. ఈ మాసంలో శివాలయంలో దీపం వెలిగిస్తే ముక్కోటి దేవతలను పూజించినట్లు సమానమట. దీంతో శివుని కృప మన మీద ఉంటుందట. సుఖసంతోషాలతో ఆనందంగా వెదజల్లుతూ ఉంటాము. ముఖ్యగా దీపం ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి వస్తుందట.
ఇక ఇలా దీపాలు పెట్టడం తో పాటు, హోమాలు చేయడం కూడా మంచిదని కొంతమంది పండితులు చెప్పుకొస్తున్నారు. దీపాలను  సూర్యుడు ఉదయించక ముందే పెట్టాలి. సాయంత్రం వేళలో సూర్యుడు అస్తమించే టప్పుడు పెట్టాలి. మనం ఉదయం పూట దీపం వెలిగించి తులసి చెట్టు దగ్గర పెడితే అది కార్తీక దామోదరుడు కి చెందుతుందట. మనం శివుని దగ్గర పెట్టే దీపం అది శివునికి చెందుతుందట. దీపారాధనను కేవలం నువ్వుల నూనె తోనే చేయడం మంచిదని తెలియజేస్తున్నారు. దీపారాధన వెలిగించేటప్పుడు అగ్గిపుల్లలతో కాకుండా కర్పూరంతో వెలిగించాలని పండితులు తెలియజేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: