గణేషుడి పూజ ఏ సమయంలో చేయాలి..?

Divya
సర్వ విజ్ఞానలు తొలగించే మహాగణపతిని ప్రతి ఒక్కరూ ఎంతో భక్తిశ్రద్ధలతో, వినయ విధేయతలతో భగవాన్ స్మరణ చేసుకుంటూ ఉంటారు. అయితే ఏ కార్యక్రమం చేపట్టాలని అన్నా విఘ్నేశ్వరుడి పూజ చేసిన తర్వాత మిగతా దేవుళ్ళకు పూజ చేయాల్సి ఉంటుంది. ప్రజలు మాత్రమే కాదు దేవదేవతుల కూడా శ్రీ మహా గణపతికి మొదటి పూజను సమర్పించిన తర్వాత ఇతర కార్యక్రమాలను చేపట్టడం ఆనవాయితీ. ఇకపోతే ఇంతటి పవిత్రత సంపాదించుకున్న మహాగణపతి చతుర్ధి రోజున పూజను ఏ సమయంలో ఆచరించాలో ఇప్పుడు క్లుప్తంగా తెలుసుకుందాం..
భాద్రపద మాసం.. ప్లవ నామ సంవత్సరం..దక్షిణాయనం చవితి రోజున మహా గణపతి పూజను జరుపుకుంటారు. సెప్టెంబర్ -10 - 2021వ తేదీన  శుక్రవారం నాడు మహా గణపతి కి ప్రీతికరమైన ప్రసాదాలను నైవేద్యంగా అందించి, మంగళ హారతులతో దేవుడిని ప్రసన్నం చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా పూజ చేయవలసిన సమయం ఉదయం 5:00 నుండి 8:15 నిమిషాలలోపు.. గణపతి పూజలు నిర్విరామంగా కొనసాగించవచ్చు. ఒకవేళ ఈ సమయంలో పూజ చేయడం కుదరని వాళ్ళు తిరిగి ఉదయం 9:10 నుండి మధ్యాహ్నం 12:30 నిమిషాల లోపు శ్రీశ్రీశ్రీ వినాయక వ్రతాన్ని చేపట్టవచ్చు.
ఇక ఈ సమయంలో మహాగణపతి వ్రతాన్ని చేపట్టడం వల్ల ఆ ఇంటికి సుఖ సంతోషాలు చేరడంతో పాటు లక్ష్మీ కటాక్షం అలాగే సరస్వతీ కటాక్షం లభిస్తాయి. ముఖ్యంగా మహాగణపతి కి ఎవరి స్తోమత కు తగ్గట్టు వారు పండ్లు, ఫలహారాలను ఇవ్వడంతోపాటు భగవంతుడికి అత్యంత ప్రీతికరమైన మోదక్, పాయసం, పులిహోర, ఉండ్రాళ్ళు, పంచామృతం లాంటివి తప్పకుండా సమర్పించాలి. ముఖ్యం గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. మహాగణపతి చతుర్థి రోజున రాత్రి సమయంలో చంద్రుడిని చూడకుండా ఆ రాత్రి సమయాన్ని గడిపేయాలని పండితులు చెబుతున్నారు. ఇక పండుగ రోజు.. పర్వదినాన అందరికీ ఆ మహా గణపతి ఆశీస్సులు ..ఎప్పటికీ ఉండాలని మనసారా కోరుకుంటూ..
ఓం మహా గణాధిపతయే నమః.. గణపతి బొప్పా మోరియా..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: