కృష్ణాష్టమి: ఈ రోజు చేయకూడని పనులివే ?

VAMSI
హిందూ పురాణాలలో చెప్ప బడిన విధంగా శ్రీ మహా విష్ణువు ఎనిమిదవ అవతారము అయిన శ్రీ కృష్ణుడి జన్మదినం ఈ రోజు. ఈ రోజును కృష్ణాష్టమి లేదా జన్మాష్టమి లేదా గోకులాష్టమి అని పిలుచుకుంటారు. ఈ రోజున శ్రీ కృష్ణుని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఇదే రోజున పుణ్యాన్ని ప్రసాదించే రోజని కూడా పేరుంది. ఈ శుభ దినాన శ్రీ కృష్ణుడు పూజలో లేదా రోజంతా చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి. అవేమిటంటే చూద్దాం.
* ఈ రోజున ఉదయాన్నే కుటుంబ సభ్యులంతా లేచి త్వరగా స్నానం ఆచరించి కొత్త బట్టలు కట్టుకుని పూజకు రెఢీ గా ఉండాలి.
* ఈ శుభ దినాన తీసుకునే ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు తీసుకునే ఆహారంలో గుడ్డు కానీ మాంసం కానీ తీసుకోకూడదు. కనీసం తెళ్లగడ్డలు మరియు ఎర్రగడ్డ కూడా తినడానికి వీలు లేదు.
* అంతే కాకుండా పూజ చేయడానికి ముందుగా అల్పాహారం భుజించకూడదు. శ్రీ కృష్ణుడి పూజ పూర్తి అవగానే అల్పాహారం తీసుకోవాలి.
* ఎటువంటి పరిస్థితుల్లో అల్పాహారం తీసుకున్నా తరువాత  టీ లేదా కాఫీ కానీ తీసుకోకూడదు. ఇలా తీసుకుంటే కడుపులో అసిడిటీని కలిగించి ఫుడ్ సరిగ్గా తీసుకోవడానికి సహాయపడదు. కాబట్టి ఈ రోజు పూర్తిగా టీ లేదా కాఫీ తాగకపోవడమే మంచిది.
* ఈ రోజు ముఖ్యంగా ఇల్లంతా ఒక పండుగలా ఉంటుంది. అందరూ పండుగ వాతావరణంలో ఉంటారు. ఈ రోజున బాయట ఆహారం, అలాగే ఆయిల్ ఫుడ్ తీసుకోవడం మానేయడం మంచిది. ఇందులో కొలెస్ట్రాల్ ఉండడం వలన మీ ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుంది. కాబట్టి ఈ రోజు శ్రీకృష్ణుడికి ఇష్టమైన వంటకాలను తయారు చేసుకుని తినడం మంచిదని పండితులు సూచిస్తున్నారు.
* అంతే కాకుండా  ఈ రోజున లేని వారికి ఏదో ఒకటి దానం ఇవ్వడం మంచిది.
* ఈ రోజున కేవలం పండ్లు మరియు నీటిని మాత్రమే ఆహారంగా తీసుకోవడం శ్రేయస్కరం.
ఇలా చేయడం వలన మీరు చేసే పూజలు ఫలిస్తాయి అని అందరి నమ్మకం.  
అందరూ సుఖంగా సంతోషంగా ఈ కృష్ణాష్టమి ని జరుపుకోవాలని కోరుకుంటున్నాము.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: