దేవునిపై మీరు పూర్తి విశ్వాసంతో ఉన్నారా ?

VAMSI
ఎన్ని తరాలు మారినా, యుగాలు మారినా మన సంస్కృతులపై, ఆచార వ్యవహారాలపై, దేవుడిపై విశ్వాసాన్ని, భక్తిని వీడరాదు. అవే మనకు నిరంతరం తోడుంటాయి. జీవితంలో ఏదైనా సమస్య ఎదురైనా, కష్టం వచ్చినా వెంటనే ఆ దేవుడ్ని తలుచుకుంటాం. ఆ కష్టం నుండి గట్టెక్కించమని ఆ దేవుడికి ప్రార్దనలు చేస్తాం. అయితే దేవుడిని పూర్తిగా విశ్వసించి, మనస్పూర్తిగా ప్రార్థిస్తే ఆ దేవుడు మీ కోరికలను తప్పక వింటాడు. మీ తప్పులను మన్నించి, మిమ్మల్ని కష్టాల నుండి బయటపడేస్తాడు. అందులోనూ దేవున్నే నమ్ముకుని, నిత్యం భక్తి శ్రద్ధలతో పూజలు చేసే వారి చేయిని ఏ మాత్రం విడిచిపెట్టరు. మనం చేయాల్సింది ఒక్కటే, మన ఇష్ట దైవాలపై పూర్తి విశ్వాసం ఉంచడం. నిత్యం దీపం వెలిగించి నమస్కరించుకోవాలి. కష్టం వచ్చినపుడు తలచుకుని రక్షించమని వెడుకోవడంలో తప్పు లేదు.

కానీ అదే శ్రద్ధ ప్రతి రోజూ చూపించడం వలన పూర్తి అనుగ్రహం లభిస్తుందని కొందరు పండిత పురోహితులు చెబుతున్నారు. మీరేమి ప్రతి దినం రకరకాల నైవేద్యాలతో అలంకరణలు చేసి పూజ చేయాలనేమి లేదు. కాని ప్రతి రోజూ ఇల్లు శుభ్రపరిచి దేవుని ముందు కాస్త చక్కెరయినా సరే నైవేద్యంగా పెట్టి మీ ఇష్ట దైవాలను ప్రార్థించడం మంచిదంటున్నారు పండితులు. ఇక నిత్య పూజ చేసే సమయంలో పాటించవలసిన నియమాలు. ఇల్లు పరిశుభ్రంగా ఉండాలి. స్నానం చేసిన పిమ్మటే దేవుని పూజ గది వైపు వెళ్ళాలి. శుభ్రమైన దుస్తులను ధరించాలి.

దేవుని పటాలకు కానీ, ప్రతిమలకు కానీ దుమ్ము, ధూళి పట్టరాదు. కాబట్టి శుభ్రంగా ఉంచుకోవాలి. మొదట దీపం వెలిగించి ముందుగా ఆది దేవుడి ఆ గణ నాయకుడికి అనగా విఘ్నేశ్వరునికి ముందుగా నమస్కరించుకోవాలి. నైవేద్యం, ఇత్తడి చెంబులో నీరు దేవునికి సమర్పించడం మరువరాదు.  ఇలా ఈ చిన్న చిన్న నియమాలు పాటిస్తూ నిత్య పూజ చేస్తే అంతా శుభమే కలుగుతుంది. మీరు కూడా ఈ రోజు నుండే ఇలా చేయడం ప్రారంభించండి. దేవుని యందు ప్రతి క్షణము విశ్వాసాన్ని కలిగి ఉండండి .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: