మీకు రాత్రిళ్ళు కలలో తరచూ ఇవి కనిపిస్తున్నాయా ... ?

VAMSI
సహజంగా ప్రతి మనిషికి కలలు వస్తుంటాయి. మన పెద్దవాళ్ళు కలలకు కొన్ని అర్థాలను చెప్పారు. అయితే కొందరు వీటిని నమ్ముతారు. మరికొందరు వాటిని లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని కొట్టిపారేస్తారు. నమ్మినా నమ్మకున్నా మన పూర్వీకులు కలలు మన భవిష్యత్తును చెప్పే సూచనలని వాటికి కొన్ని అర్దాలను చెప్పారు. భగవంతుడు మనకు అందించబోయే వాటిని కలల ద్వారా మనకు ముందుగానే తెలియచేస్తారని పండితులు చెబుతున్నారు. రాత్రి పూట వచ్చే కలకు పగటి పూట వచ్చే కలలకు వేరు వేరు వివరణలు ఇచ్చారు. పగటి పూట వచ్చే కలలని పగటి కలలు అంటారు. అయితే మనం పగటి పూట విశ్రాంతి తీసుకునే సమయంలో కొన్ని కలలు వస్తుంటాయి.
కానీ అవన్నీ ఒట్టి కలలే తప్ప అవి వేటినీ సూచించవని, అవేమి నిజం కావని చెబుతున్నారు. అందుకనే ఏదైనా జరగదని చెప్పడానికి పగటి కలలు కంటున్నారు అని అంటుంటారు. ఇక రాత్రి పూట వచ్చే కలలు మనకు  ఏదో జరగబోయే విషయాన్ని తెలియజేస్తాయని చెబుతారు. అందులోనూ తెల్లవారుజామున వచ్చే కలలు కచ్చితంగా నిజమౌతాయని మన పూర్వీకులు చెప్పిన మాట. కలలో కనిపించే అంశాలను బట్టి అవి శుభ సూచకాలా లేక అశుభ సూచకాల అనేది అంచనా వేస్తారు.  అయితే కలలో ఏవి కనిపిస్తే మనకు శుభ సూచకాలో, ఏవి కనిపిస్తే మనకు ఐశ్వర్యం కలగబోతున్నట్లు సూచకమో , వాటి పరిణామాలను పెద్దలు ఏ విధంగా వివరించారో  ఇప్పుడు తెలుసుకుందాం.  కలలో కనుక మనం పొలం మధ్యలో నుండి వెళుతున్నట్టు కానీ, పొలం ఉన్నట్టు కానీ కల వస్తే అది మనకు పట్టబోయే అదృష్టాన్ని సూచిస్తున్నట్లని చెబుతున్నారు పెద్దవారు.
అదేవిధంగా మన కలలో చీమలు దండు అంటే చీమల గుంపు వరుసగా వెళుతున్నట్లు కనిపిస్తే మన వృత్తికి సంబంధించి అభివృద్ధి జరుగబోతున్నట్లు. అలాగే మీ కలలో మీరు గుర్రపు స్వారీ కానీ, లేదా ఏనుగు స్వారీ కానీ చేస్తునట్టు కనిపిస్తే  త్వరలో మీకు రాజ యోగం పట్టబోతున్నట్లు సూచన.  అంటే ఆర్ధిక లాభం కానీ,  సమాజంలో పేరు ప్రఖ్యాతలు కానీ పెరగబోతున్నట్లు సూచన. అలాగే కలలో కనుక పళ్ళ తోటలు కానీ, పళ్ళు కానీ, ముఖ్యంగా మామిడి లేదా జామ పళ్ళు కనిపిస్తే సంతానం లేని వారికి సంతాన యోగ్యం కలుగబోతున్నదని సూచన. అదే విధంగా గోవు కనుక కనిపిస్తే ఏవైతే మనం అనుకున్న కార్యాలు జరగకుండా ఇబ్బందులు ఎదురవుతుంటాయో అలాంటి వాటికి ఆటంకాలు తొలగిపోయి  ఆ కార్యాలు పూర్తవుతాయని అర్ధం. కలలు అన్ని జరగపోయినప్పటికీ 70 శాతం కలలు నిజమౌతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: