ఇంట్లో బాబా విగ్రహం పెట్టొచ్చా ... ?

VAMSI
సాయి బాబా ని ఎంతో మంది హిందువులు తమ ఇష్ట దైవంగా కొలుస్తుంటారు. అలాగే కొందరు ముస్లిములు సైతం సాయిని ఆరాధిస్తుంటారు. సాయి బాబా ఒక మసీదులో నివసించారు మరియు గుడిలో సమాధి అయ్యారు. రెండు మతాల పద్దతులను తన బోధనలో అవలంబించారు సాయి. ఇలా హిందువులు , అలాగే ముస్లిములు కూడా సాయిని తమ దైవంగా భావిస్తారు. ఆయనకు నిత్యం పూజ చేస్తూ తమ భక్తిని చాటిచెబుతారు. ఆ బాబాకు గురువారాన్ని ప్రీతికరమైన రోజుగా చెప్పబడుతుంది. ప్రతి గురువారం నాడు అన్ని సాయి దేవాలయాలలో ప్రత్యేక పూజలు జరుపుతుంటారు. అన్నదానాలు చేస్తుంటారు, భజన కార్యక్రమాలు జరుపుతుంటారు.

భక్తులు కూడా గురువారం నాడు బాబాకి ప్రత్యేకించి పూజలు చేస్తారు. అయితే చాలా మందికి బాబా విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకుని పూజలు చేయవచ్చా అన్న సందేహం ఉంది. వాస్తవానికి అంగుష్ఠ ప్రమాణం కు మించిన దేవుళ్ళ విగ్రహాలను ఇంట్లో పెట్టుకుని పూజించరాదని పండితులు చెబుతున్నారు. ఇలా చేయడం మంచిది కాదట. కానీ ఒక్క సాయి బాబా విగ్రహాన్ని మాత్రం అంగుష్ఠ ప్రమాణానికి మించినప్పటికీ ఇంట్లో పూజ మందిరంలో పెట్టుకుని నిత్య  పూజలు చేయవచ్చును.  బాబా ఒక సద్గురువు కావున  ఆ బాబా విగ్రహాన్ని గృహంలో ఉంచి పూజ చేయవచ్చని చెబుతున్నారు పురోహితులు.

కానీ బాబా విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకునే వారు.. తప్పకుండా కొన్ని నియమాలు పాటించాలి. నిత్యం పూజ చేస్తూ, నైవేద్యాన్ని సమర్పించాలి. ప్రతి గురువారం బాబా విగ్రహానికి అభిషేకం చేయాలి. సద్గురువైన సాయి తన భక్తులకు ఎటువంటి కస్టాలు రాకుండా రక్షణ కల్పిస్తారు. నమ్మి కొలిచే వారికి ఎప్పుడూ తోడు నీడగా వారి వెంట ఉంటారన్నది అక్షర సత్యం.. మీ ప్రతి ప్రశ్నకు బాబా ఏదో ఒక రూపంలో, ఏదో ఒక దారిలో సమాధానం అందిస్తారు. శ్రీ సద్గురు సాయి నమః

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: