ఉగాది రోజున వేప పువ్వుని ఎందుకు తినాలో తెలుసా..?

Suma Kallamadi
తెలుగువారి పెద్ద పండుగలలో ఉగాది పండగ కూడా ఒకటి అని చెప్పాలి. ఈ పండగ రోజున తెల్ల‌వార‌క ముందే లేచి ఇల్లు మొత్తం శుభ్రం చేసుకుని, గడపకు పసుపు కుంకుమ, గుమ్మానికి మామిడి తోరణాలు కట్టాలి. అలాగే  పూజా మందిరాన్ని కూడా రంగవల్లికలతో అలంకరించుకోవాలి.ఉగాది రోజున తెల్లవారు ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల లోపు పూజ చేయడం మంచిది.ఈ రోజున బ్రాహ్మ ముహూర్తాన మేల్కొని, అభ్యంగన స్నానం చేసి. కొత్త బ‌ట్ట‌లు క‌ట్టుకుని దేవాల‌యాన‌కి వెళ్లి ద‌ర్శ‌నం చేసుకుంటే  మీకు అంతా మంచే జరుగుతుంది. ఫాల్గుణ శుద్ధ పూర్ణిమ తెల్లవారి మామిడి పువ్వును తినాలని, ఉగాది నాడు వేపపూవు తినాలని చెప్పడం వల్ల ఆరోజున ఉగాది పచ్చడి షడ్రుచులతో తయారు చేసి తినడం ఆనవాయితీగా వస్తుంది.


 కొత్తసహస్రాబ్ధికి ప్రారంభ శుభ సూచకంగా భావించే ఈ రోజు నుంచి సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్టసుఖాలను, ఆనంద విషాదాలను సంయమనంతో, సానుకూలంగా స్వీకరించాలన్న సందేశమే ఉగాది పచ్చడిలోని ఆంతర్యం. తీపి సుఖ‌ సంతోషాల‌ను, తీపి బాధ‌ల‌ను, ఒగ‌రు బంధాల‌ను ఇలా ప్ర‌తి ఒక్క ప‌దార్థం శ‌రీరానికి ప్ర‌కృతికి మ‌ధ్య బంధాన్ని తెలియ‌జేస్తుంది.ఉగాది పచ్చడి తినడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగి ఆ సంవత్సరం మొత్తం రోగాలనేవి దరిచేరవు.ఉగాది పచ్చడిలో ఉండే వేప పువ్వు కడుపులో ఉన్న నులిపురుగులను చంపేస్తుంది.


వేపగాలి ఆటలమ్మ, అమ్మోరు మొదలైన వ్యాధులను దగ్గరకు రానీయదు. మామిడి యాంటీ వైరల్ లక్షణాలు కలిగి ఉన్నది. ఇది కఫము, వాతము, పైత్యాలనే మూడు దోషాలను అదుపులో ఉంచుతుంది ఈ ఉగాది పచ్చడి. మనకు వచ్చే జబ్బుల్లో చాలా వరకూ వీటి వల్లే వస్తాయి.పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవడం వ‌ల్ల ఏడాదంతా శుభాలు క‌లుగుతాయి.ఈ ఉగాదికి త‌ప్ప‌ని స‌రిగా ఆలయాల్లో పంచాంగ శ్రవణం వినాలి. దీని ద్వారా మంచి చెడుల‌ను తెలుసుకునే వీలుంటుంది. ఈ రోజున పూజ చేసేటప్పుడు పంచహారతి ఇవ్వాల‌ని శాస్త్రం చెపుతోంది.ఈ ఉగాది పండగ రోజు మీ జీవితం సుఖ శాంతులతో ఉండాలని కోరుకుంటున్నాము.. !!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: