ఉగాది రోజు త‌ప్ప‌క చేయాల్సిన ప‌నులు

VUYYURU SUBHASH
తెలుగు వారికి ఉగాది ఎంత స్పెష‌లో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఉగాది తెలుగు వారు గ‌ర్వించే.. తెలుగు వారు మెచ్చే పండ‌గ‌. ప్ర‌పంచ వ్యాప్తంగా తెలుగు వారు ఎక్క‌డ ఉన్నా కూడా ఉగాది గురించి స్నేహితుల‌కు చెప్ప‌డంతో పాటు గొప్ప‌గా ఉగాది చేసుకుంటారు. ఉగాది రోజు ప్ర‌తి ఒక్క‌రు త‌ప్ప‌కుండా చేయాల్సిన ప‌నులు కొన్ని ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసు కుందాము... ఉగాది రోజు ముందుగా ప్ర‌తి ఒక్క‌రు ఆ సంవ‌త్స‌రం త‌మ జాత‌కం ఎలా ఉండ‌బోతుందో పంచాంగంలో తెలుసు కోవాలి. బ‌న భ‌విష్య‌త్తు ఏంటో... ఈ యేడాదిలో మ‌న లాభ న‌ష్టాలు, రాజ్య‌పూజ్య‌, అవ‌మానాలు ఏంటో పంచాంగ శ్ర‌వ‌ణం చెపుతుంది.

ఇక ఆ రోజు ప్ర‌తి ఒక్క‌రు త‌ప్ప‌కుండా షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడి తీసుకోవాలి. ఉగాది ప‌చ్చ‌డి చేసిన వారు తీసుకోవ‌డంతో పాటు ఆ ప్ర‌సాద ప‌చ్చ‌డిని ప్ర‌తి ఒక్క‌రికి పంచాలి. ఇది తీసుకోవ‌డం వ‌ల్ల వైద్య పరంగా చూసుకుంటే ఇది రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది అని అంటారు. ఇక వీలున్న వారు ఆ రోజు స్నాన పూజాదులు ఆచ‌రించిన త‌ర్వాత క‌వి స‌మ్మేళ‌నంకు వెళ్లాలి. క‌వుల‌ నుంచి జాలువారిన కవితలను, పద్యాలను అందరికీ వినిపిస్తారు. ఇవి మ‌నిషికి ఎంతో జ్ఞాన స‌ముపార్జ‌న పెంచ‌డంతో పాటు ఓ న‌మ్మ‌కం క‌లిగిస్తాయి.

ఇక ఉగాది  రోజు చేసే ఉగాది పూజ‌కు కూడా ఎంతో ప్ర‌త్యేక‌త ఉంటుంది. ఉగాది నాడు సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేయాలని పండితులు చెబుతున్నారు ఆ తర్వాత దేవుడి దగ్గరికి వెళ్లి పూజ చేసి తర్వాత సూర్యనమస్కారం చేయాలి. ఇక ఉగాది రోజున‌ పేదలకు దానం చేస్తే మంచి ఫలితాలు వుంటాయని పండితులు చెబుతున్నారు. ఏదేమైనా ఉగాది రోజు చేసే ప‌నులు మ‌నం త‌ప్ప‌క చేస్తే ఆ యేడాదంతా మ‌న‌కు మంచి ఫ‌లితాలు ఉంటాయ‌న్న‌ది ఓ న‌మ్మ‌కం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: