లక్ష్మీ దేవి మన ఇంట్లోనే ఉండాలంటే ఈ పనులు చేయండి...?

VAMSI
ఆర్థిక ఇబ్బందులు తొలగి సుఖ  సంతోషాలు కలిగి ఉండాలంటే లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడం చాలా ముఖ్యం.. ఆ మాత చల్లని చూపు మనపై ఉందంటే ఇక మన ఇంట్లో ఆర్థిక సమస్యలు లేనట్టే. అలా మనకు కనక వర్షం కురిపించే మహాలక్ష్మి ని ప్రసన్నం చేసుకోవడం కోసం కొన్ని పనులు నిరంతరం ఆచరించాల్సి ఉంటుంది. వాటిలో కొన్ని ప్రధానమైన వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మొట్టమొదటిగా శ్రీ లక్ష్మీ కటాక్షం కోసం సూర్యోదయానికి ముందుగా లేచి ఇంటికి వెనుక వైపు గల తలుపును తీసిపెట్టాలి. వెనక గది తలుపులను తీశాకే ఇంటి సింహద్వార తలుపులు తెరవాలి.
ఆ తర్వాత స్నానం ఆచరించి పనులను మొదలు పెట్టాలి. ఇంటి ముందు వేసే ముగ్గు అమ్మవారిని ఆనందంగా ఆహ్వానించడానికి గుర్తు. ప్రతి రోజూ తప్పక దీపారాధన చేయాలి.మంగళ, శుక్రవారాల్లో పంచముఖ దీపాలను వెలిగించాలి. ఈ రెండు రోజులు అమ్మ వారికి ప్రత్యేక పూజలు చేయాలి. ఇంట్లో పూజా మందిరం ముందు కూడా ముగ్గులు వేయడం మంచిది. ఇంటికి వచ్చే ముత్తైదువులకు పసుపు, కుంకుమ, తాగేందుకు నీరు తప్పకుండా ఇవ్వాలి. ముఖ్యంగా వెండి సామాన్లు, వెండి పాత్రలను ఇతరులకు బహుమతిగా ఇవ్వకూడదు.
 ఇలా చేయడం వల్ల మన ఇంట్లో లక్ష్మి ని బయటకు పంపినట్లు అవుతుంది.ఇంట్లో వున్న వెండి పాత్రలను తన సంతానానికి కూడా ఇవ్వకూడదని  పండితులు చెబుతున్నారు.ఇంట్లో వెంట్రుకలు గాలికి తిరగాడితే లక్ష్మీ కటాక్షం దక్కదు. ప్రశాంతత లేని ఇంట్లో.. నిరంతరం గొడవ జరిగే ఇంట్లో ఆ మహాలక్ష్మి నిలవదు.బయటికి వెళ్ళి కాలును శుభ్రం చేసుకోకుండా ఇంట్లోకి ప్రవేశించకూడదు. ఎప్పుడు పడితే అప్పుడు గోళ్లను కొరకరాదు. ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలి. ప్రతి ఇంట్లో ఒక తులసి చెట్టు ఉండాలి. ఆ తులసి చెట్టుకు ప్రతిరోజు పూజా పునస్కారాలు చేయాల్సి ఉంటుంది. పై చెప్పినవన్నీ చేస్తే ఆ శ్రీ మహాలక్ష్మి యొక్క అనుగ్రహానికి పాత్రులవుతారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: