గోవులను ఎందుకు అంతలా పూజిస్తారో తెలుసా...?
1. ఓం సహనావవతు,
సహనౌ భునక్తు,
సహవీర్యం కరవావహై,
తేజస్వినా వధీతమస్తు,
మావిద్విషావహై ఓం శాంతి: శాంతి: శాంతి...
తాత్పర్యం:- సర్వ జీవులు రక్షింపబడుగాక... సర్వ జీవులు పోషింపబడుగాక... అందరూ కలిసి గొప్ప శక్తితో కూడి పని చేయాలి ( సమాజ ఉద్ధరణ కోసం )... మన మేధస్సు వృద్ది చెందుగాక... మన మధ్య విద్వేషాలు రాకుండు గాక... ఆత్మా ( వ్యక్తిగత ) శాంతి, దైవిక శాంతి, ప్రాకృతిక శాంతి కలుగు గాక.
2. ఓం సర్వేషాం స్వస్తిర్భవతు..
ఓం సర్వేషాం శాంతిర్భవతు..
ఓం సర్వేషాం పూర్ణం భవతు..
ఓం సర్వేషాం మంగళం...
తాత్పర్యం:- సర్వులకు సుఖము, సంతోషము కలుగుగాక.. సర్వులకు శాంతి కలుగు గాక.. సర్వులకు పూర్ణ స్థితి కలుగుగాక.. సర్వులకు శుభము కలుగుగాక..
3. ఓం అసతోమా సద్గమయ,
తమసోమా జ్యోతిర్గమయ,
మృత్యోర్మా అమృతంగమయ..
ఓం శాంతి: శాంతి: శాంతి:
తాత్పర్యం:- సర్వవ్యాపి, నిరాకారుడైన భగవంతుడా, మమ్ములను అసత్యము ( మిధ్య ) నుంచి సత్యమునకు గొనిపొమ్ము....( అజ్ఞానం అనే ) అంధకారము నుండి ( జ్ఞానస్వరూపమైన ) వెలుగునకు దారి చూపుము. మృత్యు భయము నుండి శాశ్వతమైన అమృతత్వము దిశగా మమ్ము నడిపించుము....
పైన చెప్పిన శాంతి మంత్రములు చదివి అర్ధం చేసుకోండి. మన హిందూ సంస్కృతీ ఎంత గొప్పదో తెలుస్తుంది.