ఈస్టర్ రోజున చేయాల్సిన అతి ముఖ్యమైన పనులు ఇవే..!

క్రైస్తవుల అతి ముఖ్యమైన పండుగలలో ఈస్టర్ కూడా ఒకటి. ప్రభువైన క్రీస్తు పరమపదించిన మూడు రోజుల తర్వాత మళ్లీ ప్రాణాలతో వచ్చారు. ఈ సందర్భంగా క్రైస్తవులందరూ ఈస్టర్ పండుగను ఘనంగా జరుపుకుంటారు. మార్చి నెల 21వ తేదీ తర్వాత పౌర్ణమి పూర్తై వచ్చే తొలి ఆదివారం నాడు ఈస్టర్ పండుగను జరుపుకుంటారు. ఈ పండుగ రోజున క్రైస్తవ ధర్మాన్ని పాటించే వారు చర్చీల్లోనే గడుపుతారు. క్రైస్తవులు ఈరోజు ఉపవాస ప్రార్థనలు చేస్తారు. 
 
క్రైస్తవులు ఈరోజు చర్చీల్లో శిలువను ఉంచి క్రీస్తును కీర్తిస్తారు. చర్ఛీలలో ప్రత్యేక ప్రార్థనలు చేసి, పాటలు పాడుతూ బైబిల్ లోని విషయాలను వింటారు. మత పెద్దలు ఏసు క్రీస్తును ఎందుకు శిలువ వేయబడ్డారో బోధిస్తారు. క్రైస్తవులు ఈరోజు మనసంతా దేవునిపై లగ్నం చేసి క్రీస్తు కోసం ప్రార్థనలు చేస్తారు. ఈరోజు క్రైస్తవులు తెల్లని దుస్తులు ధరించి క్రీస్తును కీర్తిస్తూ ప్రార్థనలు చేస్తారు. ఈ ముఖ్యమైన పనులన్నీ ఈస్టర్ రోజున క్రైస్తవులు తప్పక చేయాలి. 
 
క్రిస్మస్ పండుగ లాగా ఈస్టర్ పండుగను ఘనంగా జరుపుకోరు. అయినప్పటికీ ఈ పండుగ ఎంతో ఉత్తమమైనది. ఈస్టర్ పండుగకు రెండు రోజుల ముందు వచ్చే శుక్రవారం రోజున గుడ్ ఫ్రైడే జరుపుకుంటారు. క్రీస్తు పరమపదించిన తర్వాత ఆయనను ఆరాధించేవారు నిరాశానిస్పృహల మధ్య కొట్టుమిట్టాడుతుంటే దాన్ని చూడలేక ఏసు క్రీస్తు ప్రాణాలతో తిరిగి వచ్చారని క్రైస్తువులు విశ్వసిస్తారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: