శ్రీరామ నవమి విశిష్టత మరియు ప్రాధాన్యత ఇదే.....

Suma Kallamadi

సీతా రాముల కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా ఒక పెద్ద ఉత్సవంలా ఈ పండుగని జరుపుకుంటారు. ఈ పండుగ నాడు భద్రాద్రి కొండపై ఎంతో ఘనంగా స్వామి వారికి కళ్యాణం చేస్తారు.  చైత్ర శుద్ధ నవమి నాడు శ్రీరాముడు జన్మించారని మనకి తెలిసినదే. కానీ అదే రోజున సీతా రాముల కళ్యాణం కూడా జరిగిందిట.

 

 

 

కేవలం ఇది ఒక్కటి మాత్రమే కాక సీతా రాములు అదే రోజున పద్నాలుగు సంవత్సరాలు అరణ్య వాసం ముగించుకుని తిరిగి అయోధ్యపై కాలు పెట్టారట. అందుకే ఆ రోజుకి అంత విశిష్టత ఉంది అని అంటారు. ఉదయాన్నే వివిధ రకాల పూజలనిచేసి వివిధ విధానాలని పాటించి ఈ కల్యాణాన్ని ముగిస్తారు. ఈ స్వామి వారికి తలంబ్రాలు ముఖ్యమంత్రి అందిస్తారు. ముత్యాలని ఇచ్చి  మన ముఖ్యమంత్రి కార్యక్రమంలో భాగం అవుతారు.

 

 

అలానే ఈ రోజు చివరన సీతా రాముల విగ్రహాలని విధుల్లో ఊరేగిస్తారు. కేవలం పెద్ద ఆలయాల్లో మాత్రమే కాక ప్రతీ చిన్న ఆలయాల్లో కూడా స్వామి వారి కళ్యాణం జరిపించడం తరతరాల ఆచారం. చైత్ర నవరాత్రి పేరుతో మహారాష్ట్రలో, వసంతోత్సవం పేరుతో మన ఆంధ్రాలో ఈ పండుగని పిలుస్తారు. కొన్ని చోట్ల ఈ పండుగని ఒక్క రోజు చేస్తే మరి కొన్ని చోట్ల  ఈ ఉత్సవాన్ని తొమ్మిది రోజులు నిర్వహిస్తారు.

 

 

సీతా రాముల కళ్యాణం, భక్తి గీతాలు, రామాయణ పారాయణం ఈ  రోజున తప్పక  చేస్తారు.ఇలా ప్రతీ హిందువులు వాళ్ళకి తగ్గ రీతిలో ఇళ్లల్లో కూడా చేస్తారు. పిండివంటలు చేసి ఫలాలు, వడపప్పు, పాల పొంగలి, పులిహోర వంటివి కూడా చేసి స్వామి వారికి నైవేద్యం పెడతారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: