సాయిబాబ : ఏది మంచిదో... ఏది చెడ్డదో వివేచించి శుభమైన దానినే సాయినాథుడు ప్రసాదిస్తారు..

siri Madhukar

షిరిడీ సాయి.. ఇదొక పుణ్యక్షేత్రం.  ఇక్కడ ఎన్నో కష్టనష్టాలు.. కన్నీళ్లు.. ఇబ్బందులతో వచ్చిన వారు షిరిడీలో కాలు పెడితే చాలు అన్నీ మర్చిపోయి సేద తీరుతారని నానుడి.  అంత గొప్ప పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న ఇక్కడ సాయిబాబ ఒక సామాన్యుడిలా ప్రజల్లో ఒకరిగా ఉన్నారంటే ఎవరూ నమ్మరు. కానీ ఇది నిజం సాయినాథుడు అందరి మద్యలోనే ఉండేవారు.. అన్ని భాషలు తెలుసు.. అని కులాలు, మతాలు తనవే అనేవారు.. మంచిని భోదిస్తూ ప్రజలను భక్తి వైపు నడిపించారు.  మనసులో ఉన్న కుళ్లూ..కుతంత్రాలను ప్రారద్రోలారు. అందుకే ఆయన దేవుడు అయ్యారని అంటారు. ఆత్మజ్ఞానం కలగనంత వరకు, రాగద్వేషాలను జయించలేనంత కాలం మన జన్మ పునరపి జననం పునరపి మరణంగా జీవన చక్రంలో తిరుగాడుతూనే ఉంటుంది.

 

బాబా లీల గురించి మాట్లాడుతూ.. అందరు దేవుళ్లు ఆకాశమందే ఉన్నారు. అందరి అవసరాలు భూమిపైనే ఉన్నాయిం మనమందరం భూమిపైనే ఉన్నాం. ఆకాశానికి ఎదుగుటయా? భూమిలోకి ఒదుగుటయా? అనేది మీరే నిర్ణయించుకోండి. కానీ, ఒక్కమాట ! మనం చేరుకోవాల్సింది పైకే. మనం చేరుకునే మార్గంలో ఎదురయ్యే ప్రలోభాలకు లొంగిపోతే, వ్యామోహాల నోట చిక్కితే అథ పాతాళానికి జారిపోతాం."  మనం భగవంతుడి ప్రత్యక్షం కోసం తపస్సు చేస్తుంటాం.. కరుణను సంపాదించి మనకు కావాల్సింది వరంగా పొందుతాం. అది మంచిది కావచ్చు, చెడ్డది కావచ్చు. కోరినదేదైనా కాదనకుండా భగవంతుడు వరంగా ప్రసాదిస్తాడు. 

 

భక్తులకు ఆయన కోరినది ఏదీ కాదనకుండా ఇస్తారు.. ఒకప్పుడు అసురులు తపస్సు చేసి వారి స్వార్థ చింతనతో వరాలు కోరుకునే వారు. చివరికి అవే వరాలు వారికి చివరిలో ప్రాణాంతకంగా పరిణమించిన సందర్భాల గురించి మనం పురాణాల్లో చూశాం.. కానీ సద్గురువు తీరే వేరు. సద్గురువు మనం కోరినది మనకివ్వటం కాక, మనకేది మంచిదో, ఏది చెడ్డదో వివేచించి శుభమైన దానినే ప్రసాదిస్తారు.సద్గురువులోని మరో విశిష్టత ఏమిటంటే తన శిష్యులకు, తననే నమ్ముకున్న వారికి భగవంతుడిని చేరే మార్గం చూపిస్తారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: