చేతులెత్తి నమస్కరించండి.. అద్భుత ఫలితాలు అందుకోండి..

నమస్కారం మన భారతీయ సంస్కృతిలో ఓ ప్రధాన భాగం. కొత్తవారు కనిపించినా.. పెద్దవారు తారసపడినా చేతులెత్తి నమస్కరించడం మనమందరం చేస్తాం.. కానీ ఈ నమస్కారం ఎందుకు చేయాలి.. దీని వెనుక అంతరార్థమేంటి.. తెలుసుకుందాం..

నమః – అనగా త్యాగమని వాచ్యార్థం. నేను నీకంటే తక్కువవాడను. నీవు నాకంటే గొప్పవాడవు అనే “దాస్యభావం” స్ఫురిస్తుంది. “నాకు నేను ఉపయుక్తుడను కాను”, కాబట్టి, నీవే నన్ను ఉద్దరించగలవాడవు అని ‘ఆత్మార్పణము చేసుకోవటం’ అనునిక అపూర్వయోగాన్ని “నమః" అను పదం సూచిస్తోంది.


వాస్తవానికి నమస్కారం వంటి తారక మంత్రం ఇంకొకటి లేదు. శత్రువు యొక్క శత్రుభావాన్ని సమూలంగా పోగొట్టగల శక్తి ఈ నమస్కారానికి ఉంది. నమస్కారంతో సకలార్థసిద్ధిని పొందవచ్చు. నమస్కారం వలన దైన్యభావం అలవడతాయి.

ఈ దైన్యభావం నుంచే మనలోని అహంకారం తగ్గుతుంది. సేవాభావం వలన, భగవద్భక్తి పెంపొంది, భగవంతునిపట్ల ఆరాధనాభావం కలుగుతుంది. ఆ ప్రేమారాధానమే ‘భక్తి’. అలాంటి భక్తితో సాధింపరాని సిద్ధులు లేవు. నమస్కారాలు మొక్కుబడిగా, హడావుడిగా కాక మనస్ఫూర్తిగా చేయాలి. రెండు చేతులను పూర్తిగా కలిపి హృదయస్థానాన్నిగాని, నుదుటనుగాని స్పర్శిస్తూ నమస్కరించాలి.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: