రివ్యూ: నయనతార రియల్ లైఫ్ డాక్యుమెంటరీ ఎలా ఉందంటే..?

Divya
ప్రస్తుతం ఇండియన్ సినీ పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారుతున్న అంశం ఏమిటంటే సినీ నటుడు ధనుష్, నయనతార మధ్య జరుగుతున్న వివాదమే.. దీంతో ధనుష్ పైన ఒక ఘాటు లేఖ నయనతార రాయడంతో అందరూ ఆశ్చర్యపోయారు. నయనతార జీవితాన్ని ఆధారంగా చేసుకుని నెట్ ఫిక్స్ ఒక డాక్యుమెంటరీ సిరీస్ నయనతార" బియాండ్ ది పెయిరీ టెల్" అనే డాక్యుమెంటరీని తెరకెక్కించారు. ఇందులో నయనతార, విగ్నేష్ కలసి పనిచేసిన మొట్టమొదటి చిత్రం నానుమ్ రౌడీ దాన్. అయితే ఇందులో ఉండే సన్నివేశాలను సైతం తీసుకోవాలని నిర్మాత అయిన ధనుష్ ని నయనతార కోరడంతో ఆయన అంగీకరించలేదట.


దీంతో సోషల్ మీడియాలో పెను ధ్రుమారం సృష్టిస్తోంది. అయినప్పటికీ తాజాగా డాక్యుమెంటరీ సిరీస్ అందుబాటులోకి వచ్చేసింది. మరి ఎలా ఉందంటే..? హీరోయిన్ నయనతార జీవితాన్ని ఒక అందమైన కథల చూపించే ప్రయత్నం అయితే నెట్ ఫ్లిక్స్ చూపించిందనీ  నెట్ జెన్స్ తెలుపుతున్నారు. ఎలాంటి గందరగోలం లేకుండా నయనతార కుటుంబాన్ని ఆమె చిన్నప్పటి ఫోటోలను సైతం పలు రకాల విషయాలను తెలియజేస్తూ ఆరంభంలోనే సన్నివేశాలను చూపించారట. నయనతార కూడా చిన్న వయసు నుంచి అసలు సినిమాలు చూసేది కాదని.. ఎవరైనా బంధువులు వస్తే వారితో వెళ్లేదాని అంటూ తెలిపింది. అలాంటి నయనతార హీరోయిన్ ఎలా అయిందనే విషయాన్ని కూడా చూపించారట.

కెరియర్ మొదటిలో నయనతార ఎదుర్కొన్న చాలా ఇబ్బందులను కూడా పంచుకోవడం జరిగింది.. గజినీ సినిమా సమయంలో చాలా విమర్శలు వినిపించాయని.. పత్రికలు ఇండస్ట్రీలోని వాళ్ళు తనని ఎలా బాడీ షేమింగ్ కామెంట్స్ చేశారనే విషయాలను కూడా చూపించారట. బిల్లా సినిమా కోసం బికినీ వేసుకోవడం వంటి సాహసాలు చేసిన నయనతార విమర్శల నుంచి ప్రశంసలు అందుకున్నది కూడా చూపించారట.

సినీ పరిశ్రమ అంటేనే ఒక రంగుల ప్రపంచం తెరమీద కనిపించే జీవితంలో తారల జీవితం ఉండదని చెప్పవచ్చు. అలాగే వాళ్ల జీవితాలు కూడా జరిగే కొన్ని ఇబ్బందులను బాగోద్వేగా సన్నివేశాల పైన కూడా సమంత చాలా క్లియర్ గా చెప్పేసేందట. అలాగే ఇందులో కొన్ని సన్నివేశాలు కూడా అభిమానులకు, ప్రజలను ఉద్దేశించి కొన్ని విషయాలను తెలియజేసిందట నాయనతర. ఇండస్ట్రీలో ఉండే హీరోలను ఎవరు ప్రశ్నించారు కేవలం మహిళలను మాత్రమే ప్రశ్నిస్తూ ఉంటారని.. ముఖ్యంగా రిలేషన్ షిప్ లో ఉన్నట్లుగా ఎక్కువగా మహిళల మీద రాస్తూ ఉంటారని తెలిపింది.

ఒకానొక సమయంలో వ్యక్తిగత జీవితాల వల్ల సినిమాలో విమర్శల వల్ల కెరియర్ని కోల్పోవలసిన సమయంలో అవకాశాలు ఎలా వచ్చాయని విషయం పైన మాట్లాడుతూ.. నాగార్జున సార్ ఫోన్ చేసి బాస్ సినిమాలో అవకాశం ఇవ్వడంతో పాటు రిలేషన్ దెబ్బతిన్న సమయంలో శ్రీరామరాజ్యం చిత్రంలో అవకాశం రావడం వల్ల కూడా చాలామంది తనని అవమానించారని సీత పాత్ర చేసినన్ని రోజులు కూడా నయనతార చాలా నిష్టగా ఉన్నానని తెలిపింది.  అక్కడి నుంచి తాను లేడీస్ సూపర్ స్టార్ ఎలా అయ్యారు అనే విషయాన్ని తెలిపింది.

మొత్తానికి మొదటి అర్థభాగం అంతా నయనతార కెరియర్ ని ప్రస్తావించారట.  రెండవ భాగం విజ్ఞేశ్ శివన్ ఫ్యామిలీ కెరియర్ ని చూపించారు. అప్పుడప్పుడే సినీ కెరియర్ల డైరెక్టర్గా ఎదుగుతున్న విగ్నేష్ కి నాయనతార చెప్పిన ధైర్యాన్ని కూడా తెలియజేశారు. అలాగే విగ్నేష్ తో ప్రేమలో ఎలా పడిందని విషయాన్ని కూడా చెప్పారట. మొత్తానికి ధనుష్ నయనతార మధ్య వివాదంతో చర్చనీ అంశానికి కారణమైనటువంటి సినిమాలోని సన్నివేశాలను కూడా ఇందులో చూపించారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: