టీవీ: ఎట్టకేలకు బ్రేకప్ గురించి ఓపెన్ అయిన జబర్దస్త్ రోహిణి..!

Divya
బిగ్ బాస్ -8 సీజన్ ప్రస్తుతం ఊపందుకుంటోంది. వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన పాత కాంటెస్ట్ వల్ల బిగ్ బాస్-8 ప్రేక్షకధారణ పెరుగుతోంది. ఇటీవలే హౌస్ లో ఒక ఎమోషనల్ ఎపిసోడ్ జరగగా రీసెంట్గా హౌస్ లో ఉన్న కంటెస్టెంట్కు సైతం సర్ప్రైజ్లు ఇస్తూ వారి ఇంటి సభ్యులను సైతం హౌస్ లోకి పంపించడం జరిగింది. ఇలా చాలామంది కంటెస్టెంట్స్ ఎమోషనల్ గా మాట్లాడడం జరిగింది. అలాగే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ప్రేమ కథల గురించి కూడా చెప్పమని బిగ్ బాస్ అడగగా మొదటిసారి తన బ్రేకప్ స్టోరీని సైతం తెలియజేసింది జబర్దస్త్ రోహిణి.

తన ప్రేమ కథను తెలియజేస్తూ తన కథ చాలా విషాదంతా మైనది అంటూ తెలియజేసింది రోహిణి. తన స్నేహితుడే తనని చాలా మోసం చేశారని చాలా బాధపడుతూ తెలిపింది రోహిణి.. రోహిణి మాట్లాడుతూ .. అతను తనకు చాలా క్లోజ్ ఫ్రెండ్ అని డైమండ్ రింగ్ ఇచ్చి మరి ప్రపోజ్ చేయడంతో తాను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను తనకు ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులను కూడా తెలపడంతో అవి క్లియర్ అయ్యాకే వివాహం చేసుకుందామన్నాడు.. అందుకు తాను కూడా ఒప్పుకున్నానని తెలిపింది. అయితే అలా లవ్ ప్రపోజ్ చేసిన సంతోషం ఎక్కువ కాలం నిలవలేదు అతను వేరే అమ్మాయితో రెండేళ్లుగా రిలేషన్ లో ఉన్నాడు అంటూ ఎమోషనల్ గా తెలియజేసింది రోహిణి.

అయితే ఈ విషయాన్ని సైతం తన దగ్గర దాచారని ఆ తర్వాత ఏదో ఒక సిల్లి రీజన్స్ చెప్పి బ్రేకప్ చెప్పి తన దగ్గర నుంచి వెళ్లిపోయాడు అంటూ తెలియజేసింది రోహిణి. ప్రస్తుతం రోహిణి క్రేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు మొదట పలు సీరియల్స్ లో నటించిన ఈమె ఆ తర్వాత జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చి భారీ క్రేజ్ అందుకొని ఇప్పుడు పలు సినిమాలలో లేడీ కమెడియన్ గా కూడా అదరగొట్టేస్తోంది. అయితే రోహిణి లవ్ బ్రేకప్ తెలిసి అభిమానులు కాస్త ఎమోషనల్ గా కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: