ఇండియాలోనే రిచ్‌ హీరోయిన్‌..రూ.900 కోట్ల ఆస్తులు, 800 కిలోల వెండి, 28 కిలోల బంగారం?

Veldandi Saikiran
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ప్రతి ఒక్కరికి సుపరిచితమే. తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేసి కోట్లాదిమంది ప్రజల హృదయాలను గెలుచుకుంది. జయలలిత మొదట సినిమా రంగానికి చెందిన వ్యక్తి. ఎన్నో సినిమాలలో నటించి విపరీతమైన అభిమానులను సంపాదించుకుంది. అంతేకాకుండా ముఖ్యమంత్రిగా పనిచేసి ఎన్నో సేవా కార్యక్రమాలను సైతం చేసింది. ఇక 2016లో జయలలిత అనారోగ్యంతో మరణించిన సంగతి తెలిసిందే. అప్పట్లో తమిళంలో ఓ స్టార్ గా వెలుగుందుతున్న ఎంజీఆర్ సరసన ఎన్నో చిత్రాలలో నటించింది. 


ఎంజీఆర్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత జయలలిత కూడా రాజకీయాల్లోకి వచ్చింది. ఎంజీఆర్ మరణానంతరం ఆయన వారసురాలిగా ప్రకటించుకున్న జయలలిత జానకి రామచంద్రన్ తర్వాత ఆమె తమిళనాడు రాష్ట్రానికి ఎన్నికైన రెండో మహిళా ముఖ్యమంత్రిగా చరిత్రలోకి ఎక్కారు. కాగా జయలలిత ఒకానొక సమయంలో తమిళం, తెలుగు, హిందీ సినిమాలలో మంచి నటిగా రాణించారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో సైతం అనేక సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్గా దూసుకెళ్లింది. 

ఇక జయలలితకు చీరలు, నగలు అంటే విపరీతమైన ఇష్టం. ఆ ఇష్టంతోనే తన అల్మారా నిండా ఖరీదైన చీరలు, నగలు, బూట్లు, చెప్పులు కోని పెట్టుకున్నానని గతంలోనే వెల్లడించారు. ఆమె గదిలో ఏకంగా 800 కిలోల వెండి, 28 కిలోల బంగారం, 10 వేలకు పైనే చీరలు ఉన్నాయట. ఈ విషయంపై గతంలో సిబిఐ అధికారులు దాడులు కూడా చేశారు. దీంతో ఈ వస్తువులన్నీ బయటపడ్డాయి. 


ఈ సమయంలోనే 28 కిలోల బంగారాన్ని సిబిఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 1997లో చెన్నై లోని పొస్సే గార్డెన్స్ లోని జయలలిత ఇంటిపైన అధికారులు దాడులు చేశారు. ఆమె రూ. 188 కోట్ల ఆస్తులు చూపించారని వెల్లడించారు. కానీ వాస్తవానికి జయలలిత వద్ద మొత్తం రూ. 900 కోట్ల ఆస్తులు కూడపెట్టుకున్నారని ఆరోపణలు వచ్చాయి. ఈ లెక్కన ఆమె దగ్గర ఉన్న ఆస్తులు.. ఇప్పటి ప్రకారం.. 6 వేల కోట్లు అవుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: