హీరో రామ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్..త్వరలో పెళ్లి భాజలు..!

Divya
టాలీవుడ్ లో యంగ్ హీరో రామ్ పోతినేని వివాహం కోసం అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. గత కొన్ని ఎళ్లుగా ఈ హీరో మీద పలు రకాల రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. కానీ ఇప్పటివరకు సరైన విషయాన్ని మాత్రం చెప్పలేదు. ఇటీవలే నటించిన డబుల్ ఇస్మార్ట్ శంకర్ ఘోరమైన డిజాస్టర్ ని మూట కట్టుకుంది. ప్రస్తుతం మహేష్ బాబు డైరెక్షన్లో ఒక సినిమాలో నటించబోతున్నట్లు సమాచారం. తాజాగా రామ్ అభిమానులకు ఒక గుడ్ న్యూస్ వైరల్ గా మారుతోంది.

అదేమిటంటే ప్రస్తుతం రామ్ వయసు 36 సంవత్సరాల అని తమ వయసు కలిగిన హీరోలంతా కూడా వివాహం చేసుకుంటూ ముందుకు వెళుతుంటే రామ్ మాత్రం ఇంకా వివాహ తేదీని చెప్పకపోవడంతో అభిమానులు నిరుత్సాహంతో ఉన్నారు. అయితే తాజాగా ఇప్పుడు వినిపిస్తున్న సమాచారం ప్రకారం హీరో రామ్ తల్లిదండ్రులు అతని పెదనాన్న ఒక సంబంధాన్ని చూసినట్లు సమాచారం. అయితే ఈ అమ్మాయి కూడా రామ్ కి కొన్ని సంవత్సరాల నుంచి బాగా తెలుసనీ మంచి స్నేహితురాలని ఆ అమ్మాయిని వివాహం చేసుకోబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది.

కుటుంబ సభ్యులు కూడా ఈ అమ్మాయినే ఒప్పుకున్నట్లు సమాచారం.వాస్తవానికి రామ్ నిశ్చితార్థం సెప్టెంబర్ లో జరగాల్సి ఉండగా కొన్ని కారణాల చేత పోస్ట్ ఫోన్ అయినట్లు సమాచారం. వచ్చే యేడాది ఫిబ్రవరిలో నిశ్చితార్థం జరిపేలా ప్లాన్ చేస్తున్నారట. ఆ అమ్మాయి కూడా హైదరాబాద్ కు చెందిన అమ్మాయిని ఒక పారిశ్రామిక కూతురు అన్నట్లుగా సమాచారం. ఈ అమ్మాయి పేరు మీద కూడా హైదరాబాద్ వంటి నగరాలలో భారీగానే కోట్ల విలువైన ఆస్తి ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న పెళ్లి పైన హీరో రామ్ క్లారిటీ ఇస్తారేమో చూడాలి మరి. మరి ఇందులో ఎంత నిజం ఉందో కూడా తెలియాల్సి ఉన్నది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: