నవంబర్ 9 నుంచి ఎన్టీవీ - భక్తి టీవీ కోటి దీపాల వెలుతురులు..!

RAMAKRISHNA S.S.
( ఆధ్యాత్మికం - ఇండియా హెరాల్డ్ )
హైదరాబాద్ వేదికగా ప్రతిఏటా భక్తి టీవీ ఎన్టీవీ నిర్వహిస్తూ వస్తున్న కోటి దీపోత్సవ కార్యక్రమానికి సమయం ఆసన్నమైంది. కార్తీక మాసం రాగానే ప్రతి హిందూ దేవీ దేవతల పూజలో నిమగ్నమైపోతారు. అలాగే కార్తీకమాసంలో విశిష్టంగా దీపాలను వెలిగిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే భక్తి టీవీ - ఎన్టీవీ సంయుక్తంగా కార్తీక కోటి దీపోత్సవం అనే కార్యక్రమాన్ని 2012లో శృంగేరి పీఠాధిపతి జగద్గురు భారతీ తీర్థ మహాస్వాముల వారి అమృత హస్తాల మీదుగా ప్రారంభించారు. అప్పటి నుంచి నిర్విరామంగా ప్ర‌తి యేడాది జరుగుతూ వస్తున్న ఈ వేడుకను అత్యంత వైభవంగా నిర్వహించడానికి సర్వం సిద్ధం చేశారు. ప్రతి ఏడాది జరిగే లాగానే ఈ ఏడాది కూడా హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియం వేదికగా ఈ కార్యక్రమాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించబోతున్నారు.

ఈ కోటి దీపోత్సవం కార్యక్రమంలో ముఖ్య ఘట్టం.. ఒక్కసారిగా ప్రజ్వలించే దీపాలు, లక్షలాది మంది భక్తులు ఒకేసారి ఒకే ప్రాంగణంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించుకునే ఈ దృశ్యం గురించి మాటలలో వర్ణించలేము అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ‘‘దీపం జ్యోతిః పరంబ్రహ్మ.. దీపం సర్వతమోపహం.. దీపేన సాధ్యతే సర్వం.. సంధ్యాదీప నమోస్తుతే’’ అంటారు. అంతే ఒక దీపమే మరో దీపాన్ని వెలిగించగలదు.. దీపం పక్కనే దీపాన్ని వెలిగిస్తే ఆ దీపాల వరుసకు లోకమంతా వెలుగులమయం అవుతుందని నమ్మకం. దీపం వెలుగుకు, జ్ఞానానికి సంకేతం, ఆధ్యాత్మికంగా దీపానికి అత్యంత ప్రాముఖ్యత ఉంది.

మన సంస్కృతికి సంప్రదాయాలకు దీపారాధన పట్టుగొమ్మ అనే చెప్పాలి. అటువంటి సంప్రదాయాన్ని భవిష్యత్‌ తరాలకు సమున్నతంగా పరిచయం చేయడమే లక్ష్యంగా 2012 నుంచి భక్తి టీవీ ఈ కోటి దీపోత్సవాన్ని నిర్వహిస్తూ వస్తుంది. దానిలో భాగంగా ఈ ఏడాది ఈ కోటి దీపోత్సవం కార్యక్రమం నవంబర్‌ 9 న ప్రారంభమై.. నవంబర్ 25 వరకు హైదరాబాద్, ఎన్టీఆర్‌ స్టేడియంలో జరుగనుంది. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనడానికి నగరం నలువైపుల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తారు. అలాగే దేశ నలుమూలల నుండి సాధు పుంగవులు, మఠాధిపతులు, పీఠాధిపతులు, ప్రవచనకర్తలు, హైందవ సమాజ సేవకులు వేలాది సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారు. ఈ యేడాది కూడా ఈ కోటి దిపోత‌వ్సం భారీ అంచనాల‌తో మొద‌లు కాబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: