పెళ్లిళ్ల‌కు అమ్మాయిలు దొర‌క‌ని దేశాలు..!

Paloji Vinay
   ప్ర‌పంచ వ్యాప్తంగా బృణ హ‌త్యలు, అమ్మాయిల ప‌ట్ల చిన్న‌చూపు పెరుగుతూనే ఉన్నాయి. దీని వ‌ల్ల జ‌నాభాలో అమ్మాల‌యిల నిష్ప‌త్తి త‌గ్గుతూనే ఉంది. భార‌త దేశం కంటే చాలా ముందున్న అభివృద్ది చెందిన.. అభివృద్ది చెందుతున్న దేశాల్లో అమ్మాయిల నిష్ప‌త్తిగా ఉండ‌డంతో పెళ్లిళ్ల‌కు అమ్మాయిలు దొర‌క‌ని దేశాలు చాలానే ఉన్నాయి. అదే విధంగా ఈ సంఖ్య క్ర‌మంగా పెరుగుతోంద‌ట‌. ప్ర‌పంచంలో మొత్తం మీద అమ్మాయిలు దొర‌క‌క పెళ్లిళ్లు ఆగిపోతున్న దేశాల్లో మొద‌టి స్థానంలో ఖ‌త‌ర్ ఉంది. 


ఖ‌తర్ దేశంలోని జ‌నాభా మొత్తంలో కేవలం 25 శాతం మాత్ర‌మే ఆడ‌వారి జ‌నాభా ఉంద‌ని నివేదిక‌లు చెబుతున్నాయి. పురుషుల సంఖ్య 1,9925084 ఉంటే ప్ర‌తి ముగ్గురు మ‌గ‌వారికి ఒక్క స్త్రీ మాత్ర‌మే ఉంద‌ట‌. దీంతో అక్క‌డ బ్ర‌హ్మ‌చారి ల సంఖ్య భారిగా పెరుగిపోతోంది.   ఇక రెండో స్థానంలో దుబాయ్ నిలిచింది అక్క‌డ పురుషుల‌కు స‌గం మ‌హిళలు ఉన్నారు. అక్క‌డ పెట్రోల్ వ్యాపారంగా ఉండ‌డంతో అక్క‌డి అమ్మాయిలు విదేశాల‌కు వెళ్లి అక్క‌డి వారినే పెళ్లి చేసుకుంటున్నార‌ట‌.


 మూడో స్థానంలో భార‌త్ నిలిచింది.. గ్రామీణంలో ఆడ‌వారిని వంటింటికే ప‌రిమితం చేయ‌డం, మ‌హిళ‌ల‌కు స‌రైన విలువ లేక‌పోవ‌డం వ‌ల్ల గ్రామీణ ప్రాంతాల్లోని జంట‌లు అబ్బాయిలు కావాల‌ని, ఆడ‌పిల్ల‌ల‌ను పురిట్లోనే చంపేస్తున్నారు. దీంతో భార‌త్‌లో స్త్రీ నిష్ప‌త్తి చాలా త‌క్కువ‌గా ఉంది. భార‌త జ‌నాభాలో పురుషుల జ‌నాభా 51.96 శాతం ఉంటే మ‌హిళ‌ల జ‌నాభా 48.06 శాతం మాత్ర‌మే ఉంది. దీంతో దేశంలో 1000 మంది పురుషుల‌కు 924 మంది మ‌హిళ‌లు మాత్ర‌మే ఉన్నారు.

  భార‌త్ త‌రువాత చైనా ఉంది. ఇక్క‌డ 104.6 మంది పురుషుల‌కు 100 మంది మ‌హిళ‌లు మాత్ర‌మే ఉన్నారు. ఆత‌రువాత ఐదో స్థానంలో ఈజిప్టు నిలిచింది. ఆ దేశంలో 30 శాతం త‌క్కువ‌గా మ‌హిళ జ‌నాభా ఉంది. ఆరో స్థానంలో నైజీరియా ఉంది. త‌రువాతి స్థానంలో అఫ్గ‌నిస్తాన్ నిలిచింది ఇక్క‌డి మ‌హిళ‌లు ఎక్కువ‌గా ఇత‌ర దేశాల‌కు వెళ్లి అక్క‌డి వారిని పెళ్లి చేసుకుంటున్నార‌ట‌. చివ‌ర‌గా ఇరాన్ అక్క‌డి మ‌హిళ‌లు అత్యంత విద్యావంతులు కావ‌డంతో వారికి త‌గ్గ అబ్బాయిలు దొర‌క‌క‌పోవ‌డంతో ఇత‌ర దేశాల వారిని వివాహం చేసుకుంటున్నారు. దీంతో అక్క‌డి అబ్బాయిల‌కు పెళ్లిళ్ల సంక్ష‌భం ఏర్ప‌డుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: