స్వాతంత్ర్యమా పాడుకో : అదిగో పులి.. దా..దా..దా..పట్టేద్దాం
మట్టిని తిన్నది ఎవ్వరు
కొండను తొక్కింది ఎవ్వరు
కొండను ఎత్తింది ఎవ్వరు
పాటలో కమ్యూనిజం ఉంది
వెతికితే పాటలోకృష్ణ తత్వం కూడా ఉంది
ఇంకా వెతికితే శివయ్య ఆజ్ఞ కూడా ఉంటుంది
దా దా దా పట్టేద్దాం .. ఆ కిటుకు..
దా దా దా దాచేద్దాం.. ఆ ఉరుము
దా దా దా దాటేద్దాం.. ఆ గండం యమ గండం
పుష్ప సినిమాకు ఓ పాట..ఇప్పుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తుంది.. దాక్కో దాక్కో మేక పులొచ్చి కొరుకుద్ది పీక..అంటూ రాయించి న పాట.. చంద్రబోస్ రాసిన పాట..ఈ పాట కొన్ని అర్థాలను వెతుకుతోంది..లేదండి!వె తకమంటోంది. వెలుతురు, చీకట్ల మధ్య తా రతమ్యం వెతకమంటోంది. ఆకలికి, అన్యాయానికి మధ్య అగాధం.. కాలాన్ని తింటది కాళీ ఇది మహా ఆకలి అంటూ రాయించారు. ఆకలి కారణంగా చావు,వేట కారణంగా చా వు..అనాదిగా ఒకరి పంతం ఒకరి ఆధిపత్యం అన్నీ అన్నీ కొన్ని చావులకు కారణం.. జీ వన్మరణాలకూ కారణం..అడవి చెప్పే సూత్రం ఆటవికం అని రాయాలి.
వేట ఆటవికం..వేటలో ఆనందం ఆటవికం..చావు న్యాయం..బతుకు పోరాటం..పోరాటం, న్యాయం పక్కపక్కనే..ఆకలి ఓ పోరాటం కొన్నిసార్లు అదే ఆఖరి పోరాటం కూడా!ఆ..పోరాటంలో భాగంగా చంపే నైజం న్యాయం. కొన్ని సార్లు ఎవరికి వారు ప్రకటించుకునే హక్కు కూడా! సమాజంలో పులి ఎవరు? మేక ఎవరు? ఆకలి ఎవరిది ? పోరాటం ఎవరికి ? కాలం నా కాలి కింద చెప్పు అన్నాడు జాలాది (గొప్ప కవి)..ఈ కాలాన్ని జయించింది ఎవరు? ఈ కాలాన్ని నిర్వచించేది ఎవరు? ఒక జీ వికి ఆకలి ఒక జీవితో యుద్ధం.. మారణ హోమం అన్నది మొదలు నుంచి తుది దాకా ఒకరికి న్యాయం ఒకరి పరంగా అది అధ ర్మం. మనం ఆపాల్సింది అడవిలో మనిషినా? లేదా అడవిలో అమలవుతున్న ఆటవిక సూత్రాలనా?
అడవి నుంచి అన్నీ తరలుతుంటాయి. మైనింగ్ సాగుతుంటుంది..మైనింగ్ చేసేవాడు పులి.. కొండను మింగేదే ఆ పులి.. మేకలు ఏమవుతాయి..మేకలు కొన్నిసార్లే పులిని నమ్మి సాయం చేస్తాయి. ఆ తరువాత ఆ పులి తన పంజా విసిరాక ప్రాణం పోయాక మోసపోయామన్న దిగులతో కనుమూస్తాయి..సమాజంలో మేకలూ,పులులూ, పాములూ,చీమలూ ఉన్నాయి..ఇంకొన్ని తమ మనుగడలో భాగంగా తమని తాము వంచించుకుంటున్నా యి..వెలుతురు రాజేసిన సమస్యల్లో చీకటి బలి.. చీకటి చేయించిన ఒ ప్పందాల్లో వెలుతురు బలి..న్యాయం బలి..చట్టం బలి..బలి అన్న పదం దగ్గరే ఆగిపోండి..వేటను వదిలి అహింసను పాటించడం పు లి ధర్మం కాదు.. వేట ఓ ధర్మం.. చంపడం ఓ ధర్మం..చావును తప్పించుకోవడం తెలివి..కానీ మన దగ్గర పులులు కన్నా మేకవ న్నె పులులే ఎక్కువ..గోముఖ వ్యాగ్రాలే ఎక్కువ..మరి!నిజాయితీతో కూడిన పులి..అమాయకం బాగా నిండిన మేక అన్నింటా ఉ న్నాయా..అంటే ఏం చెబుతాం..కనుక వేట ఆటవికం..చంపడంలో ఉన్నంత సుఖం..చావడంలో లేదు కదా! కనుక పులులను పట్టి మేకలను కాపాడడం మనకు చేతనైన పని కావాలి.
కానీ అది సాధ్యమా! కత్తికి రక్తపు పూతలు తప్పవు..అంటూనే ఏమరుపాటుగా ఉన్నా వా ఎరకే చిక్కేస్తావు..ఎరనే మింగే ఆకలి ఉంటేనే ఇక్కడ బతికుంటావు..అని రాశారు చంద్రబోస్ ఈ పాటలో..! అంత ఆకలిని అర్థం చే సుకునే సమాజమా!లేదా ఆ ఆకలిని తీర్చలేక తప్పించుకునే సమాజమా ఇది? ఏమో తెలియదు? ఎప్పటిలానే బలం ఉన్నోడిదే రాజ్యం..మరి! పులి బలం ఉన్నంత కాలమే..మేక తప్పించుకునే తెలివి ఉన్నంత వరకే! ఈ పోటీలో ఈ వేటలో తమని తాము నిరూపించుకోగలవు..కాదు కాదు తమని తాము కాపాడుకోగలవు..మన సమాజంలో పులులూ జింకలూ తోడేళ్లూ ఉన్నాయి మరి! వాటి సంగతి అవీ అంతే! శక్తి మేర యుక్తి మేర రాణించ లేకపోతే జీవన్మరణంలో చావే అంతిమం కాక తప్పదు. బూడిద తత్వం శివయ్య చెప్తాడు..మాయా గుణం కృష్ణయ్య నేర్పాడు.. ఈ రెండూ ఈ పాటలోనే ఉన్నాయి..పరిశీలించండి..మాయాన్విత ఛాయలను.. ఏదేమైనప్పటికీ ఈ పాట వేట లేదా యుద్ధం అనివార్యం.. అని చెప్పింది.. ఇది గీతా సూత్రం. కనుక గుద్దులు చెప్పే పాఠం బుద్ధుడు కూడా చెప్పడహే! అని తేల్చింది.
ఆఖరుగా వేటూరిని స్మరించుకోవాలి
నువ్వు తిన్న మన్నేరా - నిన్ను తిన్నది..
- రత్నకిశోర్ శంభుమహంతి, శ్రీకాకుళం