ఇంటికి కేజీ బంగారం ఫ్రీ.. ఆ పార్టీ కొత్త స్కీమ్?
ఇక ఇప్పుడు మరో పాపులర్ స్కీమ్ గురించి చర్చ మొదలైంది.. అదే ఇంటికి కిలో బంగారం.. వామ్మో.. ఇంటికి కేజీ బంగారమా.. ఎక్కడ.. ఏ పార్టీ.. ఎలా అంటున్నారా.. అయితే ఇదేమీ నిజమైన హామీ కాదు.. కానీ.. ఈ సారి కేసీఆర్ ఇంటికి కిలో బంగారం ఇస్తామని హామీ ఇచ్చినా గెలవరు అని ఓ తెలంగాణ కాంగ్రెస్ నేత ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇంటికి కిలో బంగారం ఇచ్చినా టీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రాదని కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతున్నాయి.
కేసీఆర్ వైఖరి, టీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతిపై రాష్ట్ర ప్రజలకు స్పష్టమైన అవగాహన వచ్చిందని ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అంటున్నారు. టీఆర్ఎస్ నేతల, మంత్రుల అవినీతి గురించి చెపుతున్నందుకే సభలో మాట్లాడకుండా తనను అడ్డుకున్నారని కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి విమర్శించారు. కోమటిరెడ్డి సోదరులు కలిసుంటే నల్గొండ జిల్లాలో వారికి ఎదురుండదని టీఆర్ఎస్ భయపడుతోందని.. అందుకే తమ మధ్య మనస్పర్థలు ఉన్నట్లు సోషల్ మీడియా ద్వారా దుష్ప్రచారం చేయిస్తున్నారని కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అంటున్నారు. తెలంగాణ కాంగ్రెస్‌లో సమర్థ నాయకులకు కొదవ లేదంటున్న రాజగోపాల్ రెడ్డి.. ఎవరి నియోజకవర్గాల్లో వారు పాదయాత్రలు చేసినా చాలు సునాయాసంగా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.