హెరాల్డ్ సెటైర్ : రాజకీయ యాత్రలతో రచ్చ చేస్తున్న ప్రతిపక్షాలు

Vijaya
రాష్ట్రంలో ప్రతిపక్షాలు పోటీ యాత్రలతో రచ్చ చేసేస్తున్నాయి. యాత్రకు అనుమతి అడిగేదొకటి. పోలీసులు అన్నీ కోణాల్లోను పరిశీలించి అనుమతిచ్చేది ఒకపద్దతికి. కానీ చివరకు యాత్ర మొదలుపెట్టేది ఇంకో పద్దతిలో. దాన్ని పోలీసులు అడ్డుకుంటే రోడ్లమీదకు వచ్చి నానా రచ్చ చేసేయటం ఆశ్చర్యంగా ఉంది. ఇంతకీ విషయం ఏమిటంటే తిరుపతి లోక్ సభ నియోజకవర్గంలో ధర్మ పరిరక్షణ యాత్ర పేరుతో ఈరోజు నుండి పదిరోజుల పాటు ఓ రాజకీయ యాత్రను చేయాలని చంద్రబాబునాయుడు ఆదేశించారు. దానికి తగ్గట్లే నేతలు, కార్యకర్తలు యాత్రకు రెడీ అయిపోయారు. అయితే చివరినిముషంలో పోలీసులు యాత్రను అడ్డుకున్నారు. దాంతో చంద్రబాబు తెచ్చుపెట్టుకున్న ఆవేశంతో ఊగిపోయారు. పోలీసులను, ప్రభుత్వాన్ని నోటికొచ్చినట్లు మాట్లాడేశారు.



ఇంతకీ విషయం ఏమిటంటే ధర్మ పరిరక్షణ యాత్ర చేసేందుకని తెలుగుదేశంపార్టీ అనుమతి కోరుతు పోలీసులకు థరఖాస్తు చేసుకున్నది వాస్తవమే. దరఖాస్తును పరిశీలించిన పోలీసులు అనుమతిచ్చింది కూడా నిజమే. అయితే దరఖాస్తులో చెప్పినట్లు టీడీపీ విరుద్దంగా యాత్రను మొదలుపెట్టింది. ఎలాగంటే పాదయాత్ర చేస్తామని దరఖాస్తులో చెప్పినట్లు కాకుండా మోటారుబైకులతో ర్యాలీ మొదలుపెట్టింది. భారీ సంఖ్యలో వాహనాలతో ర్యాలీగా వెళడానికి ప్రయత్నించింది. అలాంగే బహిరంగంసభలకు కూడా ప్లాన్ చేసిందట. అంటే పాదయాత్ర ద్వారా ధర్మ పరిరక్షణ యాత్ర అని చెప్పి మోటారు వాహనాల ర్యాలీ, భారీ సంఖ్యలో వాహనాలతో ర్యాలి, బహిరంగసభలు నిర్వహించేందుకు ప్లాన్ చేయటం లాంటివి ఎలా చేయాలని అనుకుందో అర్ధం కావటం లేదు.



అంటే దరఖాస్తులో ఒకటి చెప్పి వాస్తవంగా మరొకటి చేయటానికి రెడీ అయ్యింది. దాంతో పోలీసులు అడ్డుకున్నారు. దీన్ని చంద్రబాబు తప్పుపడుతూ నోటికొచ్చినట్లు మాట్లాడేసి ఊగిపోవటమే ఆశ్చర్యంగా ఉంది. తాము యాత్రలు చేయకూడదా ? తాము చేయాలనుకున్న యాత్రను అడ్డుకునే హక్కు పోలీసులకు ఎవరిచ్చారు ? అంటూ పోలీసులను నిలదీయటమే విచిత్రంగా ఉంది. దరఖాస్తులోనే మోటారుబైకుల ర్యాలీ, బహిరంగసభ నిర్వహిస్తామని ఎందుకు చెప్పలేదు. ఇక బీజేపీ విషయం చూస్తే తిరుపతిలోని కపిలతీర్ధం టు రామతీర్ధం అంటూ మరోయాత్ర చేయబోతోంది. ఫిబ్రవరి 4వ తేదీన మొదలయ్యే యాత్రకు అనుమతి ఇవ్వాలంటూ రూటుమ్యాపును పోలీసులకు దరఖాస్తు చేసుకుంది. తమ యాత్రకు పోలీసులు అనుమతివ్వకపోతే ఊరుకునేది లేదంటూ అప్పుడే బీజేపీ నేతలు హెచ్చరికలకు దిగేయటం విడ్డూరంగా ఉంది. దరఖాస్తును పోలీసులు పరిశీలించాలి. తర్వాత ఏదైనా అనుమానాలుంటే నేతలతో మాట్లాడాలి. అప్పుడు అనుమతివిషయంపై క్లారిటి ఇస్తారు. ఇదంతా ఏమీ జరగకుండానే దరఖాస్తు ఇచ్చిన వెంటనే అనుమతికోసం పోలీసులను బెదిరించటమే ఆశ్చర్యంగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: