సెటైర్ : ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యిందే ?

సాధారణంగా రాజకీయ నాయకులు జనాలకు టోపి పెట్టడం సర్వసధారణం. అసలు వారి నైజం అంతే అన్నట్లుగా ప్రజలలోను అభిప్రాయం ఉంది. కానీ గ్రేటర్ ఎన్నికలలో ప్రజలు నాయకులకి కుచ్చుటోపి పెట్టడం, ఓట్లు వేసేందుకు పెద్దగా బయటకు రాకపోవడం. ఆ మేము ఓటు వేయకపోతే కొంపలేం మునిగిపోవు కదా ... ? అసలు ఈ కరోనా టైమ్ లో లైన్ లో నుంచుని ఓటు వేయడం ఎందుకు ఎలాగూ మిగతావాళ్ళు ఓట్లు వేస్తున్నారు కదా ? నేను ఓటు వేయకపోతే ఎంటట ? ఇలా ఎన్నో రకాలైన లెక్కలు వేసుకుని సైలెంట్ గా ఇంట్లో కూర్చుండి పోయారు. కానీ ఈ జనాలను నమ్ముకుని రాత్రి పగలు తేడా లేకుండా ఎన్నికల ప్రచారం నిర్వహించి, గల్లీ నుంచి ఢిల్లీ నాయకులు వరకు అందరినీ రంగంలోకి దింపి , ఊక దంపుడు ఉపన్యాసాలు ఎన్నో ఇచ్చినా, జనాలు సిల్లీగా తీసుకోవడంతో,  గ్రేటర్ లో పోటీచేసిన అన్ని రాజకీయ పార్టీలు గిలగిల లాడిపోతున్నాయి. 



ముఖ్యంగా బిజెపి ఈ ఎన్నికలలో ఎంతగా కష్టపడింది అంటే , అసలు అసెంబ్లీ ,పార్లమెంట్ ఎన్నికలకు కూడా ఇంత హడావుడి గా జరిగి ఉండేది కాదేమో అన్నట్లుగా పరిస్థితిని తీసుకు వచ్చింది. ఇప్పుడు ఢిల్లీ లీడర్ల ప్రసంగాలు, గల్లీ లీడర్ల కష్టమంతా వృథా అవుతుంది. అసలు ఇళ్ల నుంచి బయటకు రాని కొంతమంది తాము గెలుస్తామా లేదా అనే టెన్షన్ లో  ఉన్నాయి. ఇక అధికార పార్టీ గా ఉన్న టిఆర్ఎస్ ఓటింగ్ శాతం తగ్గడం పై కాస్త ఆందోళన ఉంది. ఇదంతా తమకు కలిసి వస్తుందని సంబరపడుతోంది. అయితే అసలు లెక్క మరికొన్ని రోజులు ఆగితే గాని తెలియదు. అసలు ఈ ఓటర్లు ఓటింగ్ కు రాకుండా నిర్లక్ష్యంగా  ఎందుకు ఉన్నారు అనే లెక్క తేల్చే పనిలో పార్టీలు నిమగ్నమయ్యాయి. 



అసలు తమను పాలించే హక్కు ఎవరికి ఇవ్వాలి అని జనాలు కన్ఫ్యూజ్ అయ్యి, ఆ మనం ఓటు వేయక పోయినా, ఎవరో ఒకరు గెలుస్తారు లే అంటూ లైట్ తీసుకోవడంతో, ఈ అంధకారం అలముకుంది అన్నట్లుగా పరిస్థితి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: