హెరాల్డ్ సెటైర్ : ఎల్లోమీడియా అతి తెలివికి తాజా నిదర్శనమిదేనా ?

Vijaya
జగన్మోహన్ రెడ్డి అంటేనే  ఎల్లోమీడియాకు ఒంటినిండా కారం పూసుకున్నట్లు మండిపోతుంటుంది.  అందుకనే జగన్ ప్రభుత్వంలో ఎక్కడెక్కడ బొక్కలున్నాయా ? అన్న విషయాన్ని బూతద్దం పెట్టి అదేపనిగా వెతుకుతుంటుంది.  ఒకవేళ బొక్కలు ఎక్కడా దొరకలేదనుకోండి ఎప్పటివో పాచిపోయిన బొక్కలకు మసిపూసి మారేడు కాయని చేసేస్తుంది. ఇందులో భాగంగానే చంద్రబాబునాయుడు హయాంలో జరిగిన తప్పులను కూడా జగన్ ఖాతాలో వేసేయటానికి ఏమాత్రం మొహమాటపడదు. తాజాగా జరిగిన ఓ విషయమే ఇందుకు ఉదాహరణగా నిలుస్తోంది. ఇంతకీ విషయం ఏమిటంటే  ఓ కేసు విషయంలో హైకోర్టు బుధవారం ఓ తీర్పిచ్చింది. అదేమిటంటే స్టేట్ సెక్యురిటి కమీషన్లో కచ్చితంగా ప్రతిపక్ష నేత ఉండితీరాలని. ఇదే విషయాన్ని ఎల్లోమీడియా తమకు అడ్వాంటేజ్ గా తీసుకుని విపరీతంగా హైలైట్ చేసింది.  హైకోర్టు తీర్పుకు ఎల్లోమీడియా ఎలాంటి కలరింగ్ ఇచ్చిందో తెలుసా ?



ఎలాగంటే  జగన్ సిఎం అయిన తర్వాత ఈ కమీషన్ లో నుండి ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడును తప్పించారనేట్లుగా  కలరింగ్ ఇచ్చింది. దానిపై ఎవరో పిటీషన్ వేస్తే విచారణ జరిపిన హైకోర్టు జగన్ కు గట్టి వార్నింగ్ ఇచ్చినట్లుగా రాసింది. నిజానికి హైకోర్టు తీర్పును పూర్తిగా కాకుండా తమకు కావాల్సిన పద్దతిలో  మాత్రమే ఎల్లోమీడియా హైలైట్ చేసిందనే విషయం అర్ధమైపోతుంది. పైగా తమ పత్రికల్లో స్టేట్ సెక్యురిటి కమీషన్లో ప్రతిపక్ష నేత ఉండాల్సిందే అంటూ పెద్ద అక్షరాలతో బాగా ఫోకస్ చేసింది. వార్తను పూర్తిగా చదివితే కానీ జనాలకు అసలు విషయం అర్ధంకాదు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే ఎల్లోమీడియాలో వచ్చిన వార్తను తల్లకిందులుగా అర్ధం చేసుకుంటే కానీ అసలు విషయం బోధపడదు. విషయం ఏమిటంటే  స్టేట్ సెక్యురిటీ కమీషన్ లో నుండి చంద్రబాబును జగన్మోహన్ రెడ్డి తీసేయలేదు. చంద్రబాబే కమీషన్ లో నుండి జగన్ను తప్పించాడు.



ప్రతి రాష్ట్రలోను స్టేట్ సక్యురిటీ కమీషన్ ఏర్పాటు చేయాలంటూ  2006లో కేంద్రప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దానికి తగ్గట్లుగా కమీషన్లో ఎంతమంది సభ్యులుండాలి, ఎవరెవరిని నియమించాలనే విషయంలో మార్గదర్శకాలను జారీ చేసింది. అయితే 2018లో కమీషన్ సభ్యుల విషయంలో చంద్రబాబు ప్రభుత్వం సవరణలను తీసుకొచ్చింది. దీని ప్రకారం ప్రతిపక్ష నేతను సభ్యునిగా తొలగించింది. అంటే చంద్రబాబు జారీ చేసిన సవరణ ఉత్తర్వుల ప్రకారం అప్పటి ప్రతిపక్ష నేత జగన్  కమీషన్లో స్ధానం కోల్పోయాడు. అయితే ఈ విషయాన్ని జగన్ పట్టించుకోలేదు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయింది.  అధికారంలోకి వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్టేట్ సెక్యురిటి కమీషన్ సభ్యుల విషయంలో  అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులే ఇఫ్పటికీ కంటిన్యు అవుతున్నాయి. దీన్ని చాలెంజ్ చేస్తు మొన్న ఫిబ్రవరిలో తాండవ యోగేంద్ర అనే లాయర్ ఓ కేసు వేశారు.



స్టేట్ సెక్యురిటి  కమీషన్లో సుప్రికోర్టు తీర్పు, మార్గదర్శకాల ప్రకారం ప్రతిపక్ష నేత కూడా ఉండాలన్నారు. ఈ కేసును  విచారించిన హైకోర్టు ఎస్ఎస్ స్సీలో ప్రతిపక్ష నేత ఉండి తీరాల్సిందేనంటూ ఆదేశించింది.  ప్రతిపక్ష నేతను సభ్యునిగా నియమిస్తు నెలరోజుల్లో ఉత్తర్వులు జారీ చేయాలని కూడా స్పష్టంగా చెప్పింది. నిజానికి కోర్టు ఇచ్చిన ఆదేశాలు చంద్రబాబు నిర్ణయానికి పూర్తి విరుద్ధం. ఎందుకంటే అప్పట్లో చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తు కోర్టులో కేసు వేస్తే దానిపై విచరణ జరిగింది.  ఈ మొత్తం మీద ఒ ఇంట్రస్టింగ్ పాయింట్ కూడా ఉంది. అదేమిటంటే చంద్రబాబు ప్రభుత్వం  ఉత్తర్వులు జారీ చేసింది 2018లో.  అయితే జీవోను చాలెంజ్ చేస్తు కేసు వేసింది 2020, ఫిబ్రవరిలో.  నిజంగానే సుప్రింకోర్టు మార్గదర్శకాలను ప్రభుత్వం అమలు కావటం లేదని అనిపిస్తే  పిటీషనర్ కేసును 2018లోనే వేసుండాల్సింది. అప్పుడు కుదరలేదంటే కనీసం చంద్రబాబు అధికారంలో ఉన్నపుడైనా వేసుండాలి.



అలాకాకుండా ఉత్తర్వులిచ్చిన చంద్రబాబు అధికారంలో నుండి దిగిపోయిన తర్వాత ఇపుడు కేసు వేయటంలో అర్ధమేంటి ? వేసిన పిటీషన్ చంద్రబాబుకు అనుకూలంగానే వేశారా అనే సందేహానికి తావిచ్చేట్లుగా ఉంది. అంటే అప్పట్లో ప్రతిపక్ష నేతను కమీషన్లో సభ్యునిగా లేకుండా చేసిన చంద్రబాబు తాను ప్రతిపక్షంలోకి రాగానే మళ్ళీ సభ్యునిగా చేరాలని కోరుకున్నట్లున్నాడు. ఇదే విషయమై తాను కేసు వేస్తే తన బండారమే బయటపడుతుంది. అందుకనే ఎవరితోనో కేసు వేయించారనే అనుమానాలు పెరుగుతున్నాయి. దానికి తగ్గట్లే జగన్ ప్రభుత్వం చేసిన తప్పును హైకోర్టు అడ్డుకుందనేట్లుగా ఎల్లోమీడియా కూడా కలరింగ్ ఇవ్వటంతో అనుమానాలు మరింతగా పెరిగిపోతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: