సెటైర్: సై'కిల్' అవుతున్న వేళ.. చినబాబు తొక్కుడు ఏంటి ?

ఆ జగన్ అలా అలా అధికారంలోకి వచ్చాడో లేదో, ఇలా ఇలా సైకిల్ పార్టీ గాలి తీసేశాడు. ఇప్పుడు సైకిల్ ఉన్నా దాని మీదకు వచ్చి తొక్కే వాడు కనిపించడంలేదు. సెంద్రబాబు చూస్తే తొక్కే ఓపిక లేక జూము, జామూ అనుకుంటూ అప్పుడప్పుడు జనల మధ్యకు వచ్చి ఎప్పుడూ ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నాడు. అసలు ఈ జగన్ ఉతుకుడు చూస్తే మాములుగా లేదు. ఎందుకు ఉతుకుతున్నాడో ఏంటో తెలియకుండానే వీర బాధుడు బాధేస్తున్నాడు. పార్టీ వాళ్లేమో కుయ్యో మొర్రో అంటూ కూని రాగాలు తీసుకుంటున్నారు. ఇప్పుడు జగన్ తొక్కుడు, ఉతుకుడు ఆషామాషీగా లేదు. సైకిల్ ఏ పార్టు కు ఆ పార్టు ఊడి మూలాన పడిపోయింది. అయినా ఏదో ఒకరకంగా తొక్కాలనే తాపత్రయం బాబు గారిలో కనిపిస్తోంది.
నిజంగా తొక్కాలని ఉన్నా తొక్కే ఓపిక లేకపోవడంతో ఇప్పుడు ఆ తొక్కుడు బాధ్యత లోకేశం బాబు తీసుకున్నాడు. నవంబర్ 2 నుంచి వీర ఆవేశంతో తొక్కేయాలని, ఏపీలో ఈ మూల నుంచి ఆ మూలకు తొక్కి తొక్కి పార్టీని ఎక్కడికో తీసుకెళ్లాలని చూస్తున్నాడు. తొక్కుడు సరే కానీ, ఇప్పుడు జగన్ ఉతుకుడు గురించే బెంగంతా. అప్పుడు మన గవర్నమెంట్ మనదే కదా అని కుంభకోణాలు, అక్రమాలు, కుట్రలు, కుతంత్రాలు, వేధింపులు, కేసులు ఇలా అందరినీ అన్ని రకాలుగా వెంటాడి వేధించేశారు. ఇప్పుడేమో ఆ లెక్కలు అన్నీ బయటకి తీసి తట తీసేస్తూ, బయపెట్టేస్తుంటే లోకేశం బాబు నేను ఉన్నా అంటూ సైకిల్ టూర్ వేయబోతున్నాడు.

అసలే సుకుమారంగా పెరిగిన సినబాబు గారు ఇప్పుడు అంత దూరం సైకిల్ ఎలా తొక్కుతారో ? మజ్జిగ పుల్లగా ఉంటుందో , తియ్యగా ఉంటుందో తెలియని సుకుమారుడు ఇప్పుడు 4 వేల కిలో మీటర్ల దూరం ఎలా తొక్కగలడో ? ఇప్పుడు బాబు గారితో పాటు సైకిల్ పార్టీలోని నాయకుల్లోనూ ఇదే బెంగ. అసలు ఈ యాత్ర మొదలయ్యే సరికి ఎంత మంది ఉంటారో ఎంతమంది వెళ్ళిపోతారో తెలియదు. అసలు సున్నితంగా, సుకుమారంగా పెరిగిన లోకేశం బాబు సైకిల్ తొక్కుతారా ? అసలు ఈ యాత్ర ఉంటుందా ? ఉన్నా, ఆయనతో సైకిల్ తొక్కే వాళ్ళు ఎవరు ? మధ్యలోనే లోకేశం బాబు నేను తొక్కలేని మొర్రో అని పారిపోతే ఎవరు ఆ రెస్పాన్సబిలిటీ తీసుకుంటారు ? దయచేసి చెప్పండయ్యా !

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: